RGV: ఈ ఏడాదైనా ఆర్జీవీ హిట్టు కొడతారా..?

  • April 7, 2021 / 01:32 PM IST

వివాదాస్పద కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ తరచూ రామ్ గోపాల్ వర్మ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. నేడు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు. కెరీర్ తొలినాళ్లలో మంచి కథ, కథనాలతో కూడిన సినిమాలను తెరకెక్కించిన వర్మ ఆ తర్వాత కాలంలో కథ, కథనాలను పట్టించుకోకుండా సినిమాలు తీస్తూ వచ్చారు. ఆర్జీవీ డైరెక్షన్ లో తెరకెక్కిన శివ టాలీవుడ్ ఇండస్ట్రీలో హిస్టరీని క్రియేట్ చేసింది. గతేడాది లాక్ డౌన్ సమయంలో కూడా సినిమాలు తెరకెక్కించి ఆ సినిమాలను ఆర్జీవీ విడుదల చేశారు.

తక్కువ ఖర్చుతో సినిమాలకు ఎక్కువ పబ్లిసిటీ వచ్చేలా చేయడం వర్మ ప్రత్యేకత. జయాపజయాలకు అతీతంగా వర్మను అభిమానించే ఫ్యాన్స్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. నేడు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు. వర్మ బర్త్ డే కావడంతో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంపై ఆర్జీవీ భిన్నంగా స్పందించారు. ఈరోజు తన పుట్టినరోజు కాదు చనిపోయిన రోజు అంటూ ఆర్జీవీ ట్విట్టర్ లో షాకింగ్ కామెంట్లు చేశారు. నా జీవితంలో ఇంకో సంవత్సరం తగ్గిపోయింది అంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

సాధారణంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే ఎవరైనా థ్యాంక్స్ అని చెబుతారు. అయితే వర్మ మాత్రం వారికి నో థ్యాంక్స్ అని చెప్పడం గమనార్హం. ఈ నెల 16వ తేదీన వర్మ ఆర్జీవీ దెయ్యం పేరుతో తన డైరెక్షన్ లో తెరకెక్కిన మరో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని వర్మ ఈ ఏడాదైనా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది. వర్మ ప్రస్తుతం హిందీ సినిమాల షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారని సమాచారం.


Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus