అవును వర్మ మళ్ళీ మొదలు పెట్టాడు. అప్పుడెప్పుడో తాను తీసిన ‘ఐస్ క్రీం’ సినిమాకి ఓ విశ్లేషకుడు జీరో రేటింగ్ ఇచ్చాడని ఆ చిత్రానికి సీక్వెల్ తీసాడు వర్మ. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని కొందరు రాజకీయ నాయకులు అడ్డుకున్నారని… ఏకంగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ వాళ్ళ పై సెటైర్లు వేస్తూ ఓ సినిమా చేసాడు. ఈరోజు విడుదల కావాల్సిన ఆ సినిమా సెన్సార్ వారు అభ్యంతరాలు చెప్పడంతో నిలిచిపోయింది. అప్పటికీ ఈ చిత్రం పేరుని ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అంటూ టైటిల్ మార్చినప్పటికీ వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. దీంతో వర్మకు మళ్ళీ కాలినట్టుంది. వాళ్ళ పై వర్మ మండిపడుతూ కామెంట్లు చేసాడు. ..
రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ… ‘ఈ సినిమాలో ఏ కులాన్నీ తక్కువ చేయలేదు. అంతా రూల్స్ ప్రకారం చేస్తే, ఏ సినిమా తీయలేము.. అది విడుదలకాదు. సెన్సార్ అనేది ‘అవుట్ డేటెడ్’ ఇన్ స్టిట్యూషన్. ‘సెటైర్’ వేయడం కోసమే ఈ సినిమాను తీసాను. ఏ పార్టీ కోసమో, వ్యక్తి కోసమో కాదు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ తీస్తుంది కూడా అలాంటి వాళ్ళ కోసమే” అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. మరి ఆ సినిమా కూడా ఇలాగే తీస్తే మాత్రం విడుదలవుతుందా.. అనేది కూడా వర్మ ఆలోచించుకోవాలి.