రామ్‌గోపాల్ వర్మ అందరిలోనూ డిఫరెంట్. ఎందుకూ అంటే ఆయన ఆలోచనలు డిఫరెంట్, అందరికంటే ఒక నిమిషం ముందే ఆయన మైండ్ రియాక్ట్ అవుతుంది. అయితే ఫ్యూచర్ సినిమాలు తీస్తుంటారు. ఇప్పటివరకు ఆయన నుండి వచ్చిన సినిమాలు చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. అయితే ఈ క్రమంలో ఎవరూ ఊహించని డిజాస్టర్లు కూడా ఇచ్చాడు వర్మ. అయితేనేం సినిమాల్లో మొత్తం జోనర్లను కవర్ చేసేశాడు. తాజాగా ‘స్పార్క్’ అని కొత్త ఓటీటీ తీసుకొస్తున్నాడు. అందులో ఓ డిఫరెంట్ మూవీ రాబోతోందట.
చావును ఆపేస్తే బాగుండు… అని చాలామంది చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఓ సినిమా స్పార్క్ ఓటీటీలో రాబోతోందట. మరణాన్ని ఆపేసే ట్యాబ్లెట్ ఉంటే, దాన్ని ప్రజలు వేసుకుంటే ఏమవుతుంది అనేదే కథ అంట. అసలు ఇలాంటి ట్యాబ్లెట్ ఉంటే మంచిదా, లేక దాని వల్ల సమస్యలు వస్తాయా అనేది సినిమాలో డిస్కస్ చేయబోతున్నారట. వృద్ధాప్యం రాగానే గుర్తొచ్చే ఈ మరణం గురించి ఈ సినిమాలో చక్కగా వివరిస్తారని తెలుస్తోంది.
వర్మ ‘స్పార్క్ ’ ఓటీటీ రేపటి నుండి అందుబాటులోకి రానుంది. అందులో ఏయే సినిమాలు ఉంటాయనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అయితే భిన్నమైన కంటెంట్ అయితే ఉంటుంది. ‘డి కంపెనీ’అనే సినిమాతో వర్మ ఈ ఓటీటీ లాంచ్ చేయబోతున్నారు. దాంతోపాటే ఈ ‘ట్యాబ్లెట్ ’కూడా ఇస్తారట. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని ఆ ఓటీటీలో వస్తాయట. మొన్నీమధ్య వర్మ మాట్లాడుతూ ‘‘ఓ సినిమా తీస్తాం. పూర్తయ్యాక దాని లైన్ బట్టి థియేటరా, ఓటీటీనా అనేది నిర్ణయిస్తాం’ అని అన్నారు. అంటే వర్మ దగ్గర ఇంకా ఇలాంటి ఆలోచనలు చాలా ఉన్నాయన్నమాట.