పబ్లిసిటీ కోసం ఇద్దరి ‘బాబు’ లను వాడేస్కుంటున్నాడా..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి జోరందుకుంది. ఓ పక్క జనసేన, టీడీపీ మరో పక్క వైసిపి పార్టీలు ప్రచారాలతో చంద్రబాబు సతమవుతున్నారు. ఇదిలా ఉంటే మరో పక్క రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం వెన్నుపోటూ అంటూ చంద్రబాబుని నిద్రలేకుండా చేస్తున్నాడు. ఈ చిత్రంలో చంద్రబాబు అసలు రూపాన్ని చూపిస్తున్నానంటూ వర్మ చంద్రబాబు పై ఒత్తిడి చేస్తున్నాడు. ఈ చిత్ర విడుదల నిలిపివేయాలని.. కేసులు కూడా పెట్టారు పలువురు టీడీపీ నేతలు. ఇక ఎన్నో వివాదాలనంతరం.. ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమైంది.

ఇదిలా ఉంటే.. మరోపక్క మోహన్ బాబు ఫీజురీయింబర్స్ మెంట్ విషయంలో చంద్రబాబుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. తాజాగా స్టూడెంట్స్ అందరినీ పోగేసి చంద్రబాబుని ఏకిపారేస్తున్నాడు మోహన్ బాబు. దీంతో వర్మ, మోహన్ బాబు ఇద్దరూ చంద్రబాబుకి యాంటీగా తయారయ్యారు.ఇప్పుడు వర్మ,మోహన్ బాబు కలిసారంటే అది చంద్రబాబు కోసమే అని ప్రతీఒక్కరికీ ఇట్టే అర్థమైపోతుంది. వర్మ… మోహన్ బాబుని కలిసిన ఫోటోని షేర్ చేస్తూ.. ‘చంద్రబాబు ఇలా అని నేను ఎప్పుడూ అనుకోలేదు’ అంటూ కోపం, ఆశ్చర్యంతో ఉన్న ఎమోజీలను పోస్ట్ చేస్తూ.. ‘f…k, b…d’ అనే బూతు పదాలను కూడా వాదండోయ్. అసలు ఈ మీటింగ్ నిజంగా జరిగిందా.. లేక మోహన్ బాబు ఫోటోలను తన టెక్నికల్ టీంతో జత చేసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పబ్లిసిటీ కోసం వర్మ ఇలా వాడుకుంటున్నాడు అనేది అంతుచిక్కని ప్రశ్న..! ఏదేమైనా ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus