రామ్ గోపాల్ వర్మ “నయీమ్” టైటిల్ రెడీ!

మాఫియా, అండర్ వరల్డ్, ఫ్యాక్షనిస్ట్ జీవితాలను తెరపైన చూపించి చిత్రోన్మాదిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ట్వీట్లకు స్పందించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొంతకాలంగా హిట్స్ లేకపోయినా ఆర్జీవీ కి క్రేజ్ మాత్రం తగ్గలేదు. నక్సలైట్ నుంచి గ్యాంగ్ స్టర్ గా ఎదిగిన నయీముద్దీన్ పనులు చూసి ఆకర్షితులయిన వర్మ .. అతని జీవితాన్ని ఆధారం చేసుకొని మూడు పార్టులుగా సినిమాలు చేస్తానని వారం రోజుల క్రితం ట్వీట్ చేశారు.

అతని ఇదివరకు పోస్టులకు వచ్చినట్లే దీనికి అభినందనలు, విమర్శలు వచ్చాయి.  ఓ అభిమాని అయితే నయీమ్ టైటిల్ ని డిజన్ చేసి వర్మకు అందించాడు. క్రిమినల్, రౌడీ, గ్యాంగ్ స్టర్, గూండా, ఫ్యాక్చనిస్ట్, అండర్ వరల్డ్ లాంటి పేర్లను చేర్చి రూపొందించిన ఈ “నయీమ్” డిజైన్ ఈ డైరక్టర్ ని ఆకట్టుకుంది. దీంతో ఆ పోస్టర్ ని బుధవారం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ డిజైన్ ఇన్నోవేటివ్ గా ఉండి నెటిజనులతో శెభాష్ అనిపించుకుంటోంది.

కాగితం పై సినిమా స్టోరీ ఒక ముక్క కూడా రాయకముందే టైటిల్ డిజైన్ కావడం ఇదే తొలిసారి అని టాలీవుడ్ సినీ ప్రముఖులు చెబుతున్నారు. వర్మ మాటకు స్పందించే వారు ఎంతోమంది ఉన్నారని తెలుపడానికి ఇదో నిదర్శనమని వెల్లడించారు. ఇప్పటికైనా ఈ కథపై ఆర్జీవి దృష్టి పెడతాడేమో చూడాలి.

https://www.youtube.com/watch?v=djfHIEmO0SI

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus