బయోపిక్ లను భయంకరంగా చిత్రీకరించడంలో నేర్పరి అయినా రామ్ గోపాల్ వర్మ నుంచి మరో రక్త చరిత్ర రాబోతోంది. విజయవాడకు చెందిన నాయకుడు దివంగత వంగవీటి మోహన్ రంగ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం విడుదలకు సిద్దమయింది. ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ మూవీని జూన్ లో విడుదల చేయాల్సింది. కానీ వాస్తవానికి దూరంగా సినిమా తీస్తే అంతు చుస్తానని వంగవీటి మోహన్ రంగ తనయుడు వర్మను బెదిరించడం, ఆ వార్నింగ్ లకు బెదరకుండా వర్మ విజయవాడకు వెళ్లడం .. కొన్నినెలల క్రితం హడావుడి జరిగింది. తర్వాత ఈ సినిమా గురించి ఎవరూ మాట్లాడలేదు. మళ్లీ ఇన్ని రోజులకు వర్మనే ప్రస్తావించారు.
వంగవీటి సినిమా ట్రైలర్ అక్టోబర్ 2 న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. పైగా ఈ చిత్రం శాంతియుతమైన సినిమా అందుకే గాంధీ జయంతి రోజున ట్రైలర్ విడుదల చేస్తున్నామని ట్వీట్ చేసి మరో వివాదానికి తెర లేపాడు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఎంత మేర శాంతిని చూపించాడో తెల్సుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Since its a peaceful film pic.twitter.com/I7kmrBCIMf
— Ram Gopal Varma (@RGVzoomin) September 3, 2016