Rhea Chakraborty: అందుకే మారిపోయా.. సినిమాలు చేయడం లేదు: రియా

మన దగ్గర కొన్ని మరణాల విషయంలో ఎన్నాళ్లయినా క్లారిటీ రాదు. అలాంటి వాటిలో కొన్ని బాలీవుడ్‌లో కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) మరణం ఒకటి. ఆయన మరణానికి కారణం నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) అని ఆ మధ్య వార్తలొచ్చాయి. అరెస్టులు కూడా జరిగాయి. తర్వాత ఆమె బయటకు వచ్చింది కూడా. కానీ ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు. ఆ విషయం అలా ఉంటే.. మరణం తర్వాత తన జీవితం ఎలా మారిందో తెలియజేసింది రియా చక్రవర్తి ఇటీవల మాట్లాడింది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని రియా చెప్పింది. నిజానిజాలు తెలియక చాలామంది తనపై విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది రియా. అందుకే యాక్టింగ్‌కు కూడా దూరమయ్యానని చెప్పింది. ప్రస్తుతం ఏం చేస్తున్నాను, జీవనాధారం ఏమిటి అని గత కొన్ని రోజులుగా అడుగుతున్నారు. నా జీవితంలో ఛాప్టర్‌ 2 స్టార్ట్ చేశాను. తాను కొంతకాలంగా సినిమాల్లో నటించడం లేదని, మోటివేషనల్ స్పీకర్‌గా మారానని చెప్పుకొచ్చింది రియా.

స్పీకర్‌గా ఇచ్చే ప్రసంగాలు ద్వారా డబ్బులు సంపాదిస్తున్నానని అని చెప్పింది. గతంలో నా లైఫ్‌లో జరిగిన విషయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవించిన బాధను స్పీచ్‌లలో చెబుతున్నా అని తెలిపింది. నా కెరీర్‌, లైఫ్‌లో ఎదుటివారు ఎన్నో ఊహించుకున్నారు. అన్నీ వాళ్లకే తెలుసు అనుకున్నారు. ఈ క్రమంలో చాలా విమర్శలు చేశారు. కొంతమంది ఏకంగా చేతబడి చేశానని కామెంట్స్‌ చేశారు. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా నిజాయతీగా నేను ఉన్నాను. ఆ నమ్మకంతోనే ధైర్యంగా ముందుకు సాగుతున్నాను అని రియా చెప్పింది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14, 2020న ముంబయిలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే అది ఆత్మహత్య కాదని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. రియా చక్రవర్తి, ఆమె ఫ్యామిలీపై ఈ మేరకు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఈడీ కేసు కూడా నమోదైంది. సీబీఐకి ఈ కేసు కూడా వెళ్లింది.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus