సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. సుశాంత్ సన్నిహితులు మరియు ఆయన దగ్గర పనిచేసిన సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు. సిబిఐ విచారణలో అనేక కొత్త విషాలు వెలుగుచూస్తున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న రియా చక్రవర్తిని సీబీఐ విచారించనుంది. ఆమెకు త్వరలో సీబీఐ నోటీసులు పంపనున్నట్లు సుశాంత్ కుటుంబం తరుపు న్యాయవాది తెలిపారు. ఆమె విచారణకు సహకరించని పక్షంలో అరెస్ట్ చేసే అవకాశం కూడా కలదని ఆయన చెప్పారు.
ఇప్పటికే రియా చక్రవర్తిపై ఈడీ కేసు నమోదు చేసింది. అలాగే ఆమె కుటుంబ సభ్యులపై కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదయ్యింది. రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ ని మానసికంగా వేధించడంతో పాటు ఆయన దగ్గర కోట్లలో డబ్బులు లాక్కుందని ఆరోపణలు వస్తున్నాయి. సుశాంత్ దగ్గర పనిచేసిన మాజీ సిబ్బంది కూడా ఆమెపై ఆరోపణలు చేశారు. రియా రాకతో సుశాంత్ జీవితంలో కష్ఠాలు మొదలయ్యాయని, ఆమె మొత్తం మార్చివేసిందని చెవుతున్నారు.
ఇక ఇటీవల సుశాంత్ మరణానికి ముందు దర్శకుడు మహేష్ భట్ తో ఆమె చేసిన వాట్స్ ఆప్ చాట్ బయటికి రావడం జరిగింది. వీరిద్దరి సంభాషణలో సుశాంత్ గురించి చర్చకు రావడం విశేషం. మొత్తంగా ఈ కేసులో రియా పూర్తిగా ఇరుక్కున్నట్లు అనిపిస్తుంది.
Most Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!