కాంతార సినిమా ద్వారా ఒక్కసారిగా రిషబ్ శెట్టి పేరు మారుమోగిపోయింది. కన్నడ చిత్ర పరిశ్రమలో తెరికెక్కిన ఈ సినిమా అన్ని భాషలలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పటికీ ఏ మాత్రం కలెక్షన్లు తగ్గకుండా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఇలా కాంతర సినిమా మంచి విజయం కావడంతో హీరో రిషబ్ శెట్టి కూడా ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే రిషబ్ శెట్టి తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూకి హాజరై సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా హిందీ రీమేక్ గురించి ప్రశ్నలు ఎదురవగా తాను రీమేక్ చేసే ఆలోచనలో లేనని తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాల ఆచారంగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా రిషబ్ శెట్టి ఎన్నో నియమ నిష్టలను పాటించారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కు ముందు నెల రోజుల నుంచి తాను నాన్ వెజ్ తినడం మానేశానని రిషబ్ శెట్టి వెల్లడించారు. ఇక ఈ సినిమాలో తాను దైవ్ కోలా సీక్వెన్స్ లో నటించే సమయంలో ఏకంగా 60 కిలోల వరకు బరువు మోయాల్సి వస్తుందని ఈయన వెల్లడించారు.
అదేవిధంగా ఈ దైవ్ కోలా సీక్వెన్స్ చేస్తున్న సమయంలో తాను ఎలాంటి ఆహార పదార్థాలను తినకుండా కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగి షూటింగ్లో పాల్గొన్నానని అలాగే ప్రసాదం మాత్రమే తీసుకున్నానంటూ ఈయన ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇలా ఈ సినిమా కోసం తాను పడిన కష్టం గురించి రిషబ్ శెట్టి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా ఎంతో సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుంటే చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రిషబ్ శెట్టి కాంతార సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశారు.