కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు రిషభ్ శెట్టి ఒకరు. ఈయన ఇదివరకు పలు సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా ఇటీవల కాంతార సినిమా ద్వారా నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా ఫ్రీక్వెల్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలను కూడా రిషబ్ శెట్టి వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇలా హీరోగా ఈయన (Rishab Shetty) ఇండస్ట్రీలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడంతో తాను సంపాదించే దాంట్లో కొంత భాగం సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈయన ఒక ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్స్ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని ఈయన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడ పిల్లలకు సరిపడా మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ఈయన భావించారు ఈ క్రమంలోనే తాను జన్మించినటువంటి గ్రామంలో ముందుగా ఈయన ఈ సేవ కార్యక్రమాలను ప్రారంభించారని తెలుస్తుంది. రిషబ్ శెట్టి కర్ణాటకలోని కెరటి గ్రామంలో జన్మించారు. ఈ గ్రామంలోని ఈయన తన ప్రాథమిక విద్యను అభ్యసించారు.
ఇలా తాను చదివినటువంటి పాఠశాలకు వెళ్లినటువంటి రిషబ్ అక్కడ ఉపాధ్యాయులతోనూ అలాగే విద్యార్థులతో మాట్లాడి పాఠశాలను అభివృద్ధి చేసేలా ఈయన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాలన్నింటినీ ఈయన అధికారకంగా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!