Rishab Shetty: కర్ణాటక స్టేట్ టాపర్ ను అభినందించిన రిషబ్ శెట్టి.. అలా చెప్పడంతో?

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి మార్కులు సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఒక స్టేట్ టాపర్ గా నిలవడం అంటే సులువైన విషయం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కర్ణాటక రాష్ట్రంలో అంకిత అనే రైతుబిడ్డ 625కు 625 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచి వార్తల్లో నిలవగా ఆ విద్యార్థినిని అభినందిస్తూ కాంతార హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.

రిషబ్ శెట్టి తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్టేట్ టాపర్ గా నిలిచిన స్టూడెంట్ అంకిత ఫోటోను షేర్ చేశారు. అంకిత సక్సెస్ ఎంతోమంది స్టూడెంట్స్ కు స్పూరిదాయకమని చెప్పుకొచ్చారు. బాగల్ కోట్ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప సక్సెస్ స్టోరీ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అంకిత, ఆ విద్యార్థిని తల్లీదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని రిషబ్ శెట్టి కామెంట్లు చేశారు.

భవిష్యత్తులో అంకిత మరిన్ని విజయాలు సాధించాలని రిషబ్ శెట్టి అన్నారు. టాలెంట్ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేలా పోస్ట్ లు పెట్టిన రిషబ్ శెట్టిని సైతం నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. రిషబ్ లాంటి సెలబ్రిటీల ప్రోత్సాహం వల్ల సక్సెస్ సాధించిన విద్యార్థులు మరింత కష్టపడి చదువుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రిషబ్ శెట్టి కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ హీరో కాంతార ప్రీక్వెల్ తో బిజీగా ఉన్నారు. కాంతార సంచలన విజయం సాధించగా కాంతార2 మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాల్సి ఉంది. కాంతార2 సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే మూవీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంకిత భవిష్యత్తులో ఐఏఎస్ కావాలని భావిస్తుండగా ఆమెకు రిషబ్ శెట్టి నుంచి ఆర్థికంగా సపోర్ట్ లభిస్తుందేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus