Rishab Shetty: హనుమాన్ లో రిషబ్ శెట్టి మిస్ అయిన రోల్ ఏంటో తెలుసా?

చిన్న సినిమాగా విడుదలై హనుమాన్ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం సొంతం చేసుకున్న రికార్డులు అన్నీఇన్నీ కావు. హనుమాన్ సినిమా రిలీజై 11 రోజులు కాగా ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షాకింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు. హనుమాన్ సినిమాలో విభీషణుడి రోల్ కోసం రిషబ్ శెట్టినిని అనుకున్నానని అయితే ఆ సమయానికి రిషబ్ కాంతార సినిమా పనులతో బిజీగా ఉన్నారని ప్రశాంత్ వర్మ అన్నారు.

కాంతార రిలీజ్ కాకముందే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. హనుమాన్ సినిమాను కాంతార వల్ల చేయలేకపోవడంతో రిషబ్ శెట్టి సైతం ఫీలయ్యారని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. అయితే భవిష్యత్తులో తన డైరెక్షన్ లో నటిస్తానని రిషబ్ శెట్టి మాట ఇచ్చారని ప్రశాంత్ వర్మ కామెంట్లు చేశారు. సముద్రఖని 100 శాతం ఎఫర్ట్ పెట్టి ఆ పాత్ర చేశారని ప్రశాంత్ వర్మ వెల్లడించారు.

రిషబ్ శెట్టి (Rishab Shetty) ఆ పాత్రలో నటించి ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. రిషబ్ శెట్టి ప్రశాంత్ వర్మలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. హనుమాన్ మూవీ విడుదలై ఎన్ని రోజులవుతున్నా ఈ సినిమాకు కలెక్షన్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇతర భాషల్లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు. హనుమాన్ మూవీ ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. హనుమాన్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతో ఈ స్థాయిలో విజయం సొంతమైంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus