Rishab Shetty, Jr NTR: రిషబ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్… క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి?

Ad not loaded.

కన్నడ చిత్ర పరిశ్రమలో తెరికెక్కిన కాంతార సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో విడుదలై ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇలా అన్ని భాషలలో విడుదలై ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబడుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇప్పటికే ఈ సినిమా చూసినటువంటి ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు క్రికెటర్లు సినిమా పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రాన్ని చూసినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక ఈ విషయాన్ని స్వయంగా రిషబ్ శెట్టి తెలియజేస్తూ ఎన్టీఆర్ తన సినిమా పట్ల ప్రశంసలు కురిపించారని నేను తనని ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలియచేయాలనుకుంటున్నాను అంటూ తెలిపారు. ఇకపోతే ఈ సినిమా విడుదలైన అనంతరం రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై రిషబ్ శెట్టి స్పందిస్తూ తాను ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే ఆలోచన ఏమాత్రం చేయలేదని తెలిపారు.

తాను ముందుగా నటీనటులను ఎంపిక చేసుకొని ఎప్పుడు స్క్రిప్ట్ రాసే అలవాటు తనకు లేదని స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఆ కథకు అనుగుణంగా ఉండే నటీనటులను ఎంపిక చేసుకుంటానని ఈ సందర్భంగా రిషబ్ శెట్టి తన సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రిషబ్ శెట్టి ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా వస్తుందనే వార్తలకు ఈ విధంగా ఈయన క్లారిటీ ఇచ్చారు.

ఇక కాంతర సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయనకు తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి ముఖ్యంగా ఈ సినిమాని తెలుగులో విడుదల చేసినటువంటి అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో రిషబ్ శెట్టి అవకాశం కల్పించారనే విషయం కూడా వైరల్ అవుతుంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus