Rishab Shetty: తారక్ నటనపై ఆసక్తికర కామెంట్స్ చేసిన రిషబ్ శెట్టి!

కాంతార మూవీ సక్సెస్ తో ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో రిషబ్ శెట్టి పేరు జోరుగా వినిపిస్తోంది. రిషబ్ శెట్టి భవిష్యత్తు సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ తన ఫేవరెట్ హీరోల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. నటనలో కమల్ హాసన్ దేవుడితో సమానం అని రిషబ్ శెట్టి తెలిపారు. అమితాబ్ బచ్చన్ ను తాను చాలా పెద్ద అభిమానిని అని రిషబ్ శెట్టి పేర్కొన్నారు.

అమితాబ్ నటించిన ప్రతి సినిమాను తాను తప్పకుండా చూస్తానని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు. కాంతార మూవీలోని హీరో రోల్ కు అమితాబ్ నటించిన యాంగ్రీ యంగ్ మ్యాన్ సినిమాలోని పాత్రకు దగ్గరి పోలికలు ఉంటాయని రిషబ్ శెట్టి వెల్లడించారు. తారక్ ఎలాంటి పాత్రలో నటించినా ఒదిగిపోతారని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. తారక్ అద్భుతంగా నటిస్తాడని ఆయన కామెంట్లు చేశారు. ఎనర్జిటిక్ ఫెర్మార్మర్ అనే మాట తారక్ కు సరిగ్గా సరిపోతుందని రిషబ్ తెలిపారు.

ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా యశ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ లను అందుకున్నాడని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. ఎంతోమందికి యశ్ స్పూర్తిగా నిలిచాడని రిషబ్ శెట్టి కామెంట్లు చేశారు. రిషబ్ శెట్టి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తారక్ కు అభిమాని అయిన రిషబ్ శెట్టి ఛాన్స్ ఉన్న ప్రతి సందర్భంలో తారక్ గురించి పాజిటివ్ గా చెబుతున్నారు.

తారక్ రిషబ్ శెట్టి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రిషబ్ శెట్టి తను హీరోగా నటించిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిషబ్ శెట్టి చాలా గ్రేట్ హీరో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రిషబ్ శెట్టి తర్వాత సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలుస్తాయేమో చూడాల్సి ఉంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus