Rishabh Shetty: అందరిలా ఒక్క హిట్ వస్తే వేరే ఇండస్ట్రీకి వెళ్ళను!

కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగాను హీరోగాను ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు రిషబ్ శెట్టి కాంతార సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన త్వరలోనే కాంతార సీక్వెల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కాంతార సినిమాకు గాను గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో ఈయన అవార్డు అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ అవార్డు వేడుకలలో భాగంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాంతార సినిమా తనకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చిందని తెలిపారు. ఈ సినిమా తర్వాత నాకు ఇతర భాష సినిమా అవకాశాలు వస్తున్నాయని అయితే తాను ఇతర సినిమాలలో నటించడానికి ఇష్టపడటం లేదని తెలిపారు. తనకు ముందుగా విజయం అందించినది కన్నడ చిత్ర పరిశ్రమ అని కాంతార సినిమాని ఇంత విజయవంతం చేసినది కన్నడ ప్రేక్షకులేనని (Rishabh Shetty) రిషబ్ శెట్టి వెల్లడించారు.

తాను కన్నడ ప్రేక్షకులకు ఎప్పుడు రుణపడి ఉంటానని తన మొదటి ప్రాధాన్యత కన్నడ చిత్ర పరిశ్రమనేనని తెలియజేశారు. తాను కన్నడ చిత్ర పరిశ్రమలో మాత్రమే సినిమాలు చేస్తానని ఈయన తెలియజేశారు. ఒక హిట్ పడితే ఇతర ఇండస్ట్రీకి వెళ్లే రకం కాదు నేను అంటూ ఈ సందర్భంగా ఈయన కామెంట్స్ చేశారు. అందరిలా హిట్టు పడితే వెళ్లే రకం కాదు అంటూ ఈయన కామెంట్ చేయడంతో ఈయన ఎవరిని ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేశారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కేజిఎఫ్ లాంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు కన్నడ పరిశ్రమకు దూరంగా ఉంటూ టాలీవుడ్ ఇండస్ట్రీకి దగ్గరైన సంగతి తెలిసిందే అలాగే రష్మిక మందన్న కూడా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు ఈయన వీరిద్దరిని ఉద్దేశించే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus