కీర్తి క్రియేటివ్స్ బ్యానర్ పైన ఎస్ పి పరిమళ కుమారి నిర్మాతగా నిర్మించిన సినిమా రిస్క్. అమెజాన్ వరల్డ్ లో వారం క్రితం రిలీజై మంచి వ్యూస్ ని , రివ్యూస్ ని అందుకున్నఈ సినిమా హంగామాలో కూడా రిలీజైంది. ఒక జర్నలిస్ట్ చేసిన స్క్రింగ్ ఆపరేషన్ వల్ల ఎలాంటి నిజాలు బయటకి వచ్చాయి..? వైరస్ ని అడ్డం పెట్టుకుని కార్పోరేట్ సంస్థలు మాఫియాతో ఎలా చేతులు కలిపాయి అనేది ఈ సినిమా కథాంశం.
ఈ సినిమలో హీరోగా హరిచరణ్ నటించగా, హీరోయిన్ గా లౌక్య నటించింది. ఇందులో పనిచేసిన ఆర్టిస్టులు దాదాపుగా అందరూ కొత్తవాళ్లే. డైరెక్టర్ ఎస్ పి పవన్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కించారు. గతంలో నేరాలు – ఘోరాలు ప్రోగ్రామ్ కి డైరెక్టర్ గా పనిచేసి పవన్ కుమార్ రిస్క్ అనే సినిమాని ఎంతో కష్టపడి తీసినట్లుగా చెప్తున్నారు. అంతేకాదు, ఎంతోమంది మీడియా మిత్రులు ఈ సినిమాకోసం పని చేశారని వారందరికీ కూడ ధన్యవాదాలు తెలుపుకున్నారు.
బిగ్ బాస్ రివ్యూస్ ఫేమ్ పరిటాలమూర్తి ఈ సినిమాకి స్టోరీ లైన్ అందించారు. మేఘాంక్ శ్యామ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ప్రస్తుతం హంగామా యాప్ లో రిలీజైంది. మరో మేటర్ ఏంటంటే, సీనియర్ యాక్టర్ కీ.శే.రాళ్లపల్లి ఈ సినిమాలో చివరిసారిగా నటించడం అనేది విశేషం.
Most Recommended Video