Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

నారా రోహిత్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక రకంగా ఇది అతనికి సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలి. ‘ప్రతినిధి 2’ పెద్దగా ఆడకపోయినా మంచి ప్రయత్నం అనిపించుకుంది. మరోపక్క మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి చేసిన ‘భైరవం’ కూడా కథాబలం ఉన్న సినిమానే. కానీ కమర్షియల్ గా ఆడలేదు అనేది నిజం. కాకపోతే ‘భైరవం’ కి ‘హరిహర వీరమల్లు’ వల్ల కలిసొచ్చింది అంటూ నారా రోహిత్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Bhairavam


‘ ‘భైరవం’ రిజల్ట్ తో హ్యాపీయేనా?’ అంటూ నారా రోహిత్ ను యాంకర్ ప్రశ్నించగా… “అఫ్ కోర్స్.! ‘భైరవం’ రిజల్ట్ తో హ్యాపీనే. అదేదో పెద్ద మాసివ్ బ్లాక్ బస్టర్, పెద్ద బ్లాక్ బస్టర్ అనే పదాలు నేను వాడను. కానీ.. అది మంచి సినిమా. కాకపోతే నిర్మాతకి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. అయినప్పటికీ అది 3 వారాల పాటు ఆ సినిమాని ఆడియన్స్ చూశారు. పవన్ కళ్యాణ్ గారి ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ వాయిదా పడటం వల్ల మా సినిమాకి కలిసొచ్చింది.కాకపోతే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు.. ఆ సినిమా స్టార్టింగ్లో ‘ఐపీఎల్’ అలాగే ఓ రీ రిలీజ్(ఖలేజా) ఉండటం వల్ల ఓపెనింగ్స్ అనుకున్నట్టు తీసుకోలేదు. అది తీసుకుని ఉండుంటే నిర్మాత కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అయితే ఆ సినిమాతో నేను హ్యాపీ. ఎందుకంటే అంతకు ముందు నేను అలాంటి సినిమా కానీ పాత్ర కానీ చేయలేదు” అంటూ చెప్పుకొచ్చారు నారా రోహిత్.

‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus