బిగ్ బాస్ విజేత అతనేనని చెబుతున్న అర్జే సూర్య!

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం రేపటితో 11వ వారం కూడా పూర్తి కానుంది. 10 వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం నుంచి 11 మంది కంటెస్టెంట్ లో బయటకు వచ్చారు. ఇకపోతే ఎనిమిదవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్ ఆర్ జె సూర్య ఎలిమినేట్ కాగానే బిగ్ బాస్ వేదికపై టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సూర్య మరోసారి బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్లు అలాగే విజేత గురించి షాకింగ్ కామెంట్ చేశారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సూర్య టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ రేవంత్ శ్రీహాన్ గీతూ ఉంటారని అనుకున్నాను అయితే అనూహ్యంగా తొమ్మిదవ వారం గీతూ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈమె స్థానంలోకి ఇనయ వచ్చారని సూర్య వెల్లడించారు.

మరి ఇప్పుడున్నటువంటి కంటెస్టెంట్లలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ విజేతగా ఎవరు నిలుస్తారు మీరు బిగ్ బాస్ వాయిస్ లో చెప్పండి అంటూ యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు టాప్ 5 కంటెస్టెంట్లుగా రేవంత్ శ్రీహాన్, ఇనయ, ఆదిరెడ్డి ఫైమా ఉండవచ్చని తెలిపారు. మీ అభిప్రాయం ప్రకారం ఈ సీజన్ విన్నర్ ఎవరు అంటూ ప్రశ్నించగా తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అలాగే హౌస్ నుంచి బయటకు వచ్చి వేదికపై నాగార్జున గారితో బిగ్ బాస్ విజేత రేవంత్ అని చెప్పాను.

ఇక బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్నటువంటి పరిస్థితులను చూసిన అనంతరం సీజన్ సిక్స్ విజేత రేవంత్ అన్న అంటూ ఈ సందర్భంగా ఈయన బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి రేవంత్ కాస్త ఆగ్రెసివ్ నెస్ తగ్గించుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ అందుకుంటారు అంటూ ఈ సందర్భంగా ఆర్ జె సూర్య బిగ్ బాస్ విన్నర్ ఎవరో జోస్యం చెప్పారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus