నితిన్, శ్రీలీల జంటగా నటించిన సినిమా ‘రాబిన్ హుడ్’. వీరి కాంబినేషన్లో ఆల్రెడీ ‘ఎక్స్ట్రా’ అనే సినిమా వచ్చింది. ఇది రెండో సినిమా కావడం. ‘ఛలో’ ‘భీష్మ’ వంటి హిట్లు ఇచ్చిన వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని.. ఈ చిత్రాన్ని నిర్మించారు. డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో చిన్న కేమియో చేయడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది అని చెప్పాలి. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు చేశారు.
మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు పర్వాలేదు అనిపించుకునే టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఓపెనింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.06 cr |
సీడెడ్ | 0.34 cr |
ఉత్తరాంధ్ర | 0.36 cr |
ఈస్ట్ | 0.15 cr |
వెస్ట్ | 0.12cr |
గుంటూరు | 0.26 cr |
కృష్ణా | 0.21 cr |
నెల్లూరు | 0.10 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.6 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.23 cr |
ఓవర్సీస్ | 0.59 cr |
వరల్డ్ వైడ్ (టోటల్ ) | 3.42 cr (షేర్) |
‘రాబిన్ హుడ్’ చిత్రానికి రూ.28 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ 2 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.3.42 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.6.5 కోట్లు కలెక్ట్ చేసింది.