నా సక్సెస్ సీక్రెట్ అదే… !

బాలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తాజాగా రన్వీర్ సింగ్ ను హీరోగా పెట్టి ‘సింబా’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో వచ్చిన ‘ఎన్టీఆర్- పూరి జగన్నాథ్’ ల సూపర్ హిట్ ‘టెంపర్’ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం. వరుసగా ఎనిమిది 100 కోట్ల చిత్రాల్ని తెరకెక్కించి మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టి సక్సెస్ సీక్రెట్ ఏంటా అని చాలా మంది బాలీవుడ్ డైరెక్టర్లు అలోచించి సతమవుతున్నారు. ఇన్ని కమర్షియల్ చిత్రాల్ని తెరకెక్కించడమంటే అది సాధారణ విషయం కాదు.

కొందరు రోహిత్ శెట్టి తెలుగు సినిమాల్ని కాపీ కొట్టేస్తాడని అందరూ అంటుంటారు. ఎంత తెలుగు చిత్రాల్ని కాపీ కొట్టిన ప్రేక్షకుల్ని మెప్పించ గల టేకింగ్ లేకపోతే చాలా కష్టం. ఇక మీ సక్సెస్ సీక్రెట్ ఏంటని డైరెక్టర్ రోహిత్ శెట్టినే అడిగితే… ఓ ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. అదేంటంటే… “స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే సినిమాలకి ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లని రాబడతాయి. ఏ కంటెంట్ అయినా ముందుగా అభిమానుల్ని మెప్పించేలా చూసుకోవాలి. అది స్టార్లకి ఇట్టే అర్ధమవుతుంది. అభిమానుల్ని సంతృప్తి పరిస్తే చాలు… అది ఎలాంటి ప్రయోగమయినా జనాల దగ్గరకి వాళ్ళే తీసుకెళ్తారు.. అదే సక్సస్ సీక్రెట్…” అంటూ రోహిత్ శెట్టి చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ చిత్రాలు డిజాస్టర్లయినా అందులో అభిమానులకి కావాల్సిన అంశాలు తగ్గకుండా చూసుకుంటాడు… దీనికి అసలు కారణం అల్లు అరవిందే అని కూడా చాలా మంది చెప్తారు. సో రోహిత్ శెట్టి కూడా అల్లు అర్జున్ నే ఫాలో అవుతాడన్న మాట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus