రోజా సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు గుర్తుకు రాలేదంటూ?

వైసీపీ మంత్రి రోజా మంత్రి పదవి వచ్చిన తర్వాత విమర్శల విషయంలో ఘాటు పెంచారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ లపై విమర్శలు చేసే నేతలలో రోజా ముందువరసలో ఉన్నారు. తాజాగా లోకేశ్ ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ కావడం గురించి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్ల గురించి రోజా స్పందిస్తూ చంద్రబాబు, లోకేశ్ ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్న సమయంలో మాత్రమే వాళ్లకు నందమూరి ఫ్యామిలీ గుర్తుకొస్తుందని కామెంట్ చేశారు.

తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వల్ల ఉపయోగం లేదని వాళ్లకు ఇప్పటికే అర్థమైందని అందువల్లే టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుతున్నారని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. లోకేశ్ పాదయాత్ర యువగళం కాదని యమగళం అని ఆమె అన్నారు. లోకేశ్ పాదయాత్రకు రావాలంటే యువత పారిపోతుందని రోజా ఎద్దేవా చేశారు. లోకేశ్ బాడీ లాంగ్వేజ్ చూసి ఎర్రగడ్డ నుంచి పారిపోయి వచ్చాడా అని అనిపిస్తుందని ఆమె కామెంట్లు చేశారు.

స్క్రిప్ట్ రాసి ఇస్తే ఆ స్క్రిప్ట్ ను లోకేశ్ 100 సార్లు చెబుతున్నాడని రోజా అన్నారు. ఆ పాదయాత్రలో ప్రశ్నలు జవాబులు కూడా ప్రీ ప్లాన్డ్ గా చెబుతున్నారని రోజా వెల్లడించడం గమనార్హం. పార్టీ పెట్టిన వ్యక్తి మనవడిని లోకేశ్ ఆహ్వానించడం దారుణమని రోజా తెలిపారు. లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారని ఆమె అన్నారు. నందమూరి ఫ్యామిలీని చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటున్నారని రోజా పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ను వాడుకుని టీడీపీ ఆధికారంలోకి రావాలని భావిస్తోందని పవన్ కళ్యాణ్ ను జీరో చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. పవన్ వెయ్యి కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాడని అసత్య వార్తలు ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలుసుకోవాలని రోజా చెప్పుకొచ్చారు. జనసేన నేతలు ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus