టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ (R0shan) హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ, అప్పుడప్పుడూ మంచి ప్రాజెక్టులు అందుకుంటున్న విషయం తెలిసిందే. రుద్రమదేవి (Rudhramadevi) చిత్రంలో చిన్న పాత్రతో మొదలుపెట్టిన రోషన్, నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందD వంటి చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా, రోషన్ లుక్స్ నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. తాజాగా రోషన్ నటిస్తున్న చాంపియన్ చిత్రం కొద్దిరోజుల క్రితం సెట్స్ పైకి వెళ్లగా, మరొక పెద్ద ప్రాజెక్ట్ వృషభ మీద పలు ఆసక్తికరమైన అంచనాలు ఉన్నాయి.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) – రోషన్ (Roshan) కలిసి తండ్రీకొడుకులుగా కనిపించబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్నట్లు ప్రకటించారు. ఇంటెన్స్ డ్రామాతో, అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రం ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని నిర్మాతలు చెప్పడం అందరిలో ఆసక్తి పెంచింది. అయితే వృషభ షూటింగ్ సంబంధిత అప్డేట్స్ చాలా కాలంగా రాలేదు. చిత్రం ప్రారంభమైన తర్వాత నుంచి మరో షెడ్యూల్ చేపట్టలేదు.
తాజాగా, నటుడు శ్రీకాంత్ (Srikanth) ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయినట్లు క్లారిటీ ఇచ్చారు. మొదటి షెడ్యూల్ పూర్తయిన తరువాత చిత్రానికి సంబంధించి ఎలాంటి వర్క్ జరగలేదని, ప్రస్తుతానికి సినిమా ఆగిపోయినట్లే అనిపిస్తోందని చెప్పారు. రోషన్ కెరీర్‌కు ఈ చిత్రం మంచి బూస్ట్ ఇస్తుందని భావించిన ఫ్యాన్స్ ఇప్పుడు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ చిత్రానికి ముందు రోషన్ (Roshan) చేసిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో, వృషభ ప్రాజెక్ట్ అతనికి మంచి అవకాశంగా కనిపించింది.
అంతేకాదు, మోహన్ లాల్ వంటి దిగ్గజ నటుడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన పాత్రకు మెమరబుల్ టర్నింగ్ పాయింట్ అవుతుందనే ఆశ కలిగించింది. కానీ సినిమా నిలిచిపోవడం అనేక ప్రశ్నలను తెర మీదకు తెచ్చింది. ఇదిలా ఉండగా, రోషన్ ప్రస్తుతం చాంపియన్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా మంచి విజయాన్ని అందించాలని రోషన్ ఆశిస్తున్నాడు.