రోషన్ కనకాల సుమ కొడుకుగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఈయన నటించినటువంటి బబుల్ గమ్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్లలో ప్రసారమవుతూ పరవాలేదు అనిపించుకుంది. ఇక ఈ సినిమా నేడు విడుదలవుతున్నటువంటి తరుణంలో ఇదివరకు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రోషన్ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. తన తాతయ్య దేవదాస్ కనకాల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లోనే తాను పెరగటం వల్ల చిన్నప్పటినుంచి తాను సినిమాలలోకి రావాలి అనుకునేవాడిని
అంతేకాకుండా సినిమా కథను నడిపే పాత్రలో తాను పోషించాలని అనుకునేవాడిని అందుకు అనుగుణంగానే ఈ సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చానని ఈ సినిమా ద్వారా హీరో కావాలనే నా కల నెరవేరింది అంటూ రోషన్ తెలిపారు. ఇక ఈ సినిమాల్లో ఓ సన్నివేశం లో షర్ట్ లేకుండా షూట్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ సన్నివేశం కోసం నేను మూడు గంటల పాటు సిటీలో షర్టు లేకుండా తిరిగానని అప్పటినుంచి నాలో ఉన్న సిగ్గు కాస్త పోయింది అంటూ రోషన్ తెలిపారు.
ఇక అమ్మ నాన్న ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఉండటం వల్ల నాకు ఏదైనా సందేహాలు వచ్చిన వారిని అడిగి తెలుసుకుంటానని ఈయన వెల్లడించారు. ఈ సినిమా నాన్న చూసి కొన్ని సన్నివేశాలలో నేను ఎంతో అద్భుతంగా నటించానని ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ప్రీమియర్ చూసిన నాన్న ఎమోషనల్ అవ్వడంతో నాకు ఎంతో సంతోషం అనిపించింది. నాన్న ఏడ్చారు అంటే నేను నా పాత్రకు పూర్తిగా న్యాయం చేశానని చాలా సంతోష పడ్డాను అంటూ ఈ సందర్భంగా రోషన్ (Roshan Kanakala) చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!