‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు విదేశాల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తుందని, ఎందుకు టీమ్ అక్కడ విడుదల చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు అంటూ మనం చాలాసార్లు అనుకున్నాం. ఓటీటీలోకి వచ్చాక ఇంకా ఆ హైప్ పెరిగింది. దీంతో ఇంటర్నేషన్ రిలీజ్ మాట ఎక్కువగా వినిపించింది. అయితే ఇన్నాళ్లకు సినిమా టీమ్‌కి ఇంటర్నేషన్ రిలీజ్ ఆలోచన వచ్చినట్లుంది. తొలుతగా సినిమాను ఎన్టీఆర్, రామ్‌చరణ్ స్పెషల్ ఫ్యాన్స్ కోసం విడుదల చేస్తున్నారు. అదేనండి జపాన్‌కు ‘ఆర్‌ఆర్‌ఆర్’ను తీసుకెళ్తున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా విడుదలై చాలా రోజుల తర్వాత టీమ్ నుండి ఈ అప్‌డేట్ వచ్చింది. జపాన్‌లో ఈ సినిమాను అక్టోబరు 21న అక్కడి భాషలోనే విడుదల చేస్తున్నారట. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తెలుగు సినిమాలపై వారికెంత అభిమానం ఉందో ఇప్పటికే జపాన్ వాసులు చాటిచెప్పారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ సూపర్ హిట్ పాటలకు జపాన్‌కు చెందిన హీరో మునిరు, సనాకీ కవర్ వీడియోలు చేసి వావ్ అనిపించారు. అయితే వాళ్లు అత్యధికంగా ఎన్టీఆర్ పాటలకే వీడియోలు చేస్తుంటారు.
ఇప్పటివరకు జపాన్‌లో రజనీకాంత్ ‘ముత్తు’, ‘రోబో’.. తారక్ ‘బాద్ షా’… రామ్ చరణ్ ‘మగధీర’.. ప్రభాస్ ‘బాహుబలి’, ‘సాహో’ విడుదలై మెప్పించయి. బాలీవుడ్ నుండి ‘3 ఇడియట్స్’, ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ జపనీస్ డబ్ అయ్యి విడుదలయ్యాయి. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ వెళ్తోంది. మరి అక్కడ ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అక్కడ సినిమా బాగా ఆడితే.. ప్రపంచవ్యాప్త వసూళ్ల లెక్కల్లో భారీ మార్పులే వస్తాయి.
దాంతోపాటు చైనాలో కూడా విడుదల చేస్తే లెక్కల్లో చాలా చాలా పెద్ద మార్పు వస్తుంది అంటున్నారు. మరి చైనా లెక్క ఎప్పుడు చూస్తారో చూడాలి. ఇప్పటివరకు సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1200 కోట్లు వసూలు చేసింది. జపాన్, చైనాలో కూడా విడుదలై మంచి వసూళ్లు అందుకుంటే ఈ నెంబరు అమాంతం పెరిగిపోతుంది అని చెప్పొచ్చు. ఇండియాలో టాప్ 1కి చేరే అవకాశం కూడా ఉంది అంటున్నారు.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!