స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీనే రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శివరాత్రి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని తెలిసి పవన్ అభిమానులు సంతోషిస్తున్నారు. అదే తేదీకి గని, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా గని రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను మాత్రం అదే తేదీకి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని బోగట్టా.
అయితే భీమ్లా నాయక్ మేకర్స్ తీసుకున్న నిర్ణయం రాజమౌళికి టెన్షన్ తగ్గించిందని తెలుస్తోంది. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ కాకపోతే ఏప్రిల్ 1వ తేదీన విడుదలయ్యేది. ఆర్ఆర్ఆర్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా భీమ్లా నాయక్ ఏప్రిల్ 1వ తేదీన విడుదలైతే థియేటర్ల విషయంలో, కలెక్షన్ల విషయంలో నష్టపోక తప్పదు. ఆర్ఆర్ఆర్ హక్కులను డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తం ఖర్చు చేసి కొనుగోలు చేశారు. కనీసం రెండు లేదా మూడు వారాల పాటు థియేటర్లలో మరే పెద్ద సినిమా రిలీజ్ కాకపోతే మాత్రమే ఆ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25వ తేదీనే విడుదలయ్యేలా చక్రం తిప్పారని కామెంట్లు వినిపిస్తున్నాయి. హీరో పవన్ కళ్యాణ్ సైతం ఫిబ్రవరి 25వ తేదీన సినిమాను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపారని బోగట్టా. భీమ్లా నాయక్ మేకర్స్ నిర్ణయంతో ఆర్ఆర్ఆర్ మేకర్స్ మాత్రం హ్యాపీ అని సమాచారం. ఏపీలో ఆక్యుపెన్సీ నిబంధనలతో సంబంధం లేకుండా సినిమాను రిలీజ్ చేయాలని పవన్ చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలను పొడిగించినట్టు ప్రకటించలేదు.
ఏపీలోని థియేటర్లలో ఆక్యుపెన్సీ గురించి త్వరలో క్లారిటీ రానుంది. భీమ్లా నాయక్ తో పవన్ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి. ఆర్ఆర్ఆర్ కు అనుకూలంగా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి.