ఎన్టీఆర్- చరణ్ అభిమానులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఆలియా భట్, అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ స్టార్లు అలాగే సముద్రఖని వంటి తమిళ స్టార్ కూడా నటిస్తున్నాడు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘ ‘బాహుబలి’ ని మించే ‘ఆర్.ఆర్.ఆర్’ ‘ ఉంటుంది అని రాజమౌళి చాలా ధీమాగా చెబుతున్నాడు.
Click Here To Watch NEW Trailer
బిజినెస్ విషయంలో కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ ‘బాహుబలి’ ని మించింది. మరి ‘ఆర్.ఆర్.ఆర్’ కి జరిగిన బిజినెస్ డీటెయిల్స్ ఎంత బ్రేక్ ఈవెన్ కు ఎంత కొట్టాలి అనే విషయాలను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 80.00 cr |
సీడెడ్ | 50.00 cr |
ఉత్తరాంధ్ర | 23.00 cr |
ఈస్ట్ | 16.00 cr |
వెస్ట్ | 14.00 cr |
గుంటూరు | 18.00 cr |
కృష్ణా | 14.00 cr |
నెల్లూరు | 09.00 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 224.00 cr |
తమిళ్ నాడు | 37.00 cr |
కేరళ | 10.00 cr |
కర్ణాటక | 43.00 cr |
నార్త్ ఇండియా (హిందీ) | 95.00 cr |
ఓవర్సీస్ | 75.00 cr |
రెస్ట్ | 08.00 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 492.00 cr |
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ట్రేడ్ అయితే రూ.1000 కోట్ల వరకు షేర్ ను ఎక్స్పెక్ట్ చేస్తుంది. టికెట్ రేట్లు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా పెరిగాయి.
పోటీగా మరో సినిమా లేదు. పాండమిక్ తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు తీసుకు వచ్చే చిత్రమవుతుంది అని అంతా భావిస్తున్నారు. టాక్ తో కూడా సంబంధం ఉండదు భారీ కలెక్షన్లు నమోదు కావడమే ఆలస్యం అన్నట్టు ఉంది ‘ఆర్.ఆర్.ఆర్’ మేనియా.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!