RRR Movie: ఆర్ఆర్ఆర్ దుబాయ్ ఈవెంట్.. డేట్ ఫిక్స్!

ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR కోసం ప్రేక్షకుల ఎదురుచూపులకు మరికొన్ని రోజుల్లో ముగింపు కార్డు పడనుంది. మార్చి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతున్న ఈ సినిమా తప్పకుండా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు మరో సారి ప్రమోషన్ భారీ స్థాయిలో చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల నిర్ణయించుకున్నారు. మొన్నటివరకూ రాధే శ్యామ్ సినిమాకు ఎలాంటి ఆటంకం కలిగే కూడదు అని దర్శకుడు రాజమౌళి రెగ్యులర్ ప్రమోషన్స్ ను అనుకున్నంతగా చేయలేదు.

Click Here To Watch Now

ఇక రాధే శ్యామ్ సినిమా విడుదల అయింది కాబట్టి ఇప్పటినుంచి ప్రమోషన్స్ డోస్ పెంచాలి అని అనుకుంటున్నారు. రామ్ చరణ్ కూడా తన భార్య ఉపాసనతో మొన్నటివరకు వెకేషన్ లో ఉన్నాడు. ఇక ఇటీవల విదేశాల నుంచి తిరిగి వస్తున్న రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మళ్లీ బిజీబిజీగా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నాడు. 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఏమాత్రం తగ్గకూడదు అని చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య మరోసారి గట్టిగానే ఖర్చు పెట్టబోతున్నారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి దుబాయ్ లోనే ప్లాన్ మొత్తం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.మార్చి 18వ తేదీన అత్యంత ఎత్తయిన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా లో రాత్రి 7 గంటలకు నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన ముందస్తు ప్రణాళికలు రాజమౌళి కొడుకు కార్తికేయ అలాగే నిర్మాత డివివి దానయ్య ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ సభ్యుల్లో అందరూ పాల్గొనబోతున్నారు.

అంతేకాకుండా హీరోయిన్ ఒలివియా మోరీస్ కూడా ఈ వేడుకకు రాబోతోంది. సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. అయితే గతంలో రిలీజ్ చేసిన ట్రైలర్ రిలీజ్ చేస్తారా లేదంటే మరో కొత్త ట్రైలర్ ను ఏదైనా రిలీజ్ చేస్తారా అనేది వేచి చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus