RRR న్యూ రిలీజ్ డేట్.. అదే బెస్ట్!

  • June 8, 2021 / 01:38 PM IST

ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేనంతగా ఇద్దరు అగ్ర హీరోలతో చేస్తున్న ఈ యాక్షన్ సినిమాను నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండడంతో అటు నార్త్ లో కూడా అంచనాలు అకాశాన్ని దాటేశాయి. ఇక సినిమా రిలీజ్ పై దర్శకుడు రాజమౌళి మరో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక అజయ్ దేవ్ గన్ కూడా మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తుండడంతో అన్ని భాషల వాళ్ళు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమా ఈ ఏడాదిలో రానట్లే అనే సంకేతాలు అందుతున్నాయి. RRRను అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు గత ఏడాది క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక కరోనా సెకండ్ వేవ్ వలన సినిమా మరొకసారి వాయిదా పడటం కాయంగా కనిపిస్తోంది.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఎలాగైనా వచ్చే ఏడాది 2021 ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి జక్కన్నకు అదే సరైన సమయం. ఎందుకంటే అంతకంటే ముందుగా సంక్రాంతిని టార్గెట్ చేస్తూ పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. దానికి తోడు సమ్మర్ హాలిడేస్ కలిసొచ్చే అవకాశం ఉందని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే వరకు నమ్మలేము.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus