RRR Twitter Review: సినీ ప్రేక్షకులందరికీ ఫుల్ ఫీస్ట్…కానీ..!

2018 చివర్లో మొదలైన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇన్నాళ్టికి థియేటర్లకు వచ్చింది. ‘బాహుబలి'(సిరీస్) తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో రాంచరణ్, ఎన్టీఆర్ లు హీరోలు కావడంతో మొదటి నుండీ అంచనాలు ఆకాశాన్నంటాయి. ఒక్క హీరోల అభిమానులు అనే కాదు సౌత్, నార్త్ లలో కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం ప్రేక్షకులు మొదటి నుండీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. మొత్తానికి ఆరోజు రానే వచ్చేసింది. యూ.ఎస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల ఇప్పటికే షోలు పడిపోయాయి.

సినిమా చూసిన వాళ్లంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వాళ్ళ టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందట. విజువల్ ఫీస్ట్ గా ఉంటుందని తెలుస్తుంది. అలాగే చరణ్ కోపదారి పాత్రలో కొంచెం నెగిటివ్ గా కనిపిస్తాడు అని తెలుస్తుంది.అతని పాత్రలో ఎంత ఎమోషన్ దాగున్నది సెకండ్ హాఫ్ లో తెలుస్తుందట. చరణ్- ఎన్టీఆర్ లు కలిసే సీన్ ను రాజమౌళి తీర్చిదిద్దిన తీరు అద్భుతమని.. ఇంటర్వెల్ ఫైట్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవని చెబుతున్నారు.

ఇద్దరు హీరోల ఇంట్రొడక్షన్ సీన్లు అదిరిపోయాయట. సెకండ్ హాఫ్ వచ్చే సరికి చాలా ఎమోషనల్ గా సాగుతుందని.ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుందని.. ఇద్దరు హీరోలు కలిసి చేసే యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్లో ఉంటాయని తెలుస్తుంది. అయితే క్లైమాక్స్ మాత్రం ఏదో మిస్ అయిన ఫీలింగ్ ను ఇస్తుందట. అజయ్ దేవగన్ పాత్ర సినిమాలో చాలా కీలకమని తెలుస్తుంది. ఆలియాభట్ పాత్రకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండదని..

ఆమె కంటే బ్రిటిష్ అమ్మాయిలా కనిపించిన ఒలీవియా మోరిస్ పాత్ర ఎక్కువగా గుర్తుంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా రాజమౌళి తన టేకింగ్ తో ఆద్యంతం అలరించాడని, మల్టీస్టారర్ లను కరెక్ట్ గా హ్యాండిల్ చేయగల దర్శకుడు ఇతనొక్కడే అని జనాలు చెబుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus