బిజినెస్ విషయంలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ప్రభంజనం..!

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి రోజు రోజుకి డిమాండ్ భారీగా పెరుగుతుంది. రాంచరణ్,ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్ర హక్కులకు గానూ దానయ్యకు మంచి ఆఫర్లు అందుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ కు గానూ భారీ అమౌంట్ పలికిందట. అయినప్పటికీ అయన రిజెక్ట్ చేసారని సమాచారం.

వివరాల్లోకి వెళితే ఈ చిత్రానికి ఓవర్సీస్ హక్కులు 65 కోట్లు వరకూ పలుకుతుందట. అయితే దానయ్య 75 కోట్ల వరకూ ఆశిస్తున్నట్టు సమాచారం. దీంతో ప్రస్తుతానికి సారీ చెప్పి తప్పుకున్నాడట. దీనికి రాజమౌళి కూడా ఓకే చెప్పాడట. ఓ టీజర్ విడుదల చేస్తే మరికొంత మంచి రేటు వస్తుందని జక్కన్న సలహా ఇచ్చాడట. అందుకే దానయ్య ఇలా ఫిక్సయినట్టు తెలుస్తుంది. ఇంకా షూటింగ్ సగం కూడా పూర్తవ్వకుండానే ఈ చిత్రానికి ఇంత రేటు పలుకుతుండడం బట్టి ఈ చిత్రానికి ఉన్న డిమాండ్ ఏంటనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus