RRR VFX: మనం చూసిందంతా ఉత్తుత్తేనా.. షాకిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఫోటోలు..!

  • May 31, 2022 / 06:43 PM IST

‘ఆర్ఆర్‌ఆర్‌’ లో అభిమానులకి గూజ్ బంప్స్‌ వచ్చే సన్నివేశాలు అనేకం ఉన్నాయి.ఎన్టీఆర్ ఇంట్రో సీన్ కావచ్చు, చరణ్ ఎంట్రీ సీన్ కావచ్చు, బ్రిడ్జి సీన్ కావచ్చు, జంతువులతో ఎన్టీఆర్ సడెన్‌ ఎంట్రీ ఇచ్చే ఇంటర్వెల్ సీన్ కావచ్చు, పులిని రామ్‌చరణ్‌ కొట్టే సీన్ కావచ్చు…. ఇలా అన్ని సీన్లు రిపీటెడ్ స్టఫ్ అనిపిస్తాయి. అయితే వీటన్నిటినీ విజువల్‌ ఎఫెక్ట్స్‌లో చూపించారు అని చెబితే వెంటనే నమ్మబుద్ది కాదు. కానీ నమ్మాలి అంత అద్భుతమైన సన్నివేశాలు వి.ఎఫ్.ఎక్స్ ద్వారానే సాధ్యపడతాయి.రాజమౌళి వంటి ఇండియన్ స్టార్ డైరెక్టర్లకి ఈ విజువల్‌ ఎఫెక్ట్స్‌ తో ఎక్కువ పని ఉంటుంది. ఈ వి.ఎఫ్.ఎక్స్ అంతటినీ అల్‌ జహ్రా స్టూడియోస్‌ చేసిందట. ఆ విజువల్‌ ఎఫెక్ట్స్‌ బ్రేక్‌ డౌన్‌ వీడియోను అల్‌ జహ్రా టీమ్‌ విడుదల చేయడం అది విపరీతంగా వైరల్ అవ్వడం కూడా జరుగుతుంది.

పులి ఎలా వచ్చింది, చరణ్.. పులి కొట్లాట, రాహుల్‌ రామకృష్ణ పామును పట్టుకోవడం, చరణ్‌ను కాటేసినట్టు చూపించడం.. ఇవన్నీ ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ బయటపడింది ‘ఆర్‌ఆర్ఆర్‌’ వీఎఫెక్స్‌ వర్క్‌కి శ్రీనివాస్‌ మోహన్‌ అండ్‌ టీమ్‌ కు ఎంత క్రెడిట్‌ ఇచ్చినా తప్పులేదు. మనం సినిమాలో చూసుకుంటే ఇవన్నీ ఎక్కడా కూడా అబద్దం, అసహజం అన్నట్టు కనబడవు. అంత చక్కగా రాజమౌళి దగ్గరుండి చెక్కించుకున్నాడు అని స్పష్టమవుతుంది. రాజమౌళి ఆలోచనా శైలిని అర్థం చేసుకొని వాటికి తగ్గ విజువల్‌ ఎఫెక్ట్స్‌ ను రూపొందించింది శ్రీనివాస్ అండ్ టీం. అంతేకాదు మనం చూసిన బ్రిడ్జి సీన్, ఉట్టి కొట్టే సీన్ అంతా కూడా వి.ఎఫ్.ఎక్స్ లో భాగమే. కావాలంటే కొన్ని సన్నివేశాలను చూద్దాం రండి :

1) రామరాజు బ్రిడ్జి పై నిలబడి ఉన్న సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. రాజమండ్రి బ్రిడ్జి స్ఫూర్తితో దానిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇదే బ్రిడ్జి నుండీ ఎన్టీఆర్, రాంచరణ్ లు రూఫ్ లు కట్టుకుని దూకినట్లు చూపిస్తారు.

2) రామరాజు బ్రిడ్జి పైకి లచు(రాహుల్ రామకృష్ణ) ని వెతుక్కుంటూ వచ్చే సన్నివేశం అంతా బ్లూ మ్యాట్ లో తీసినది.కానీ మనకి ఆ విజువల్ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది.చాలా మంది మూటలు మోసుకెళ్తున్నట్టు,బండ్లను తోలుకెళ్తున్నట్టు చూపిస్తారు. కొంచెం వెనక్కి వెళ్తే అక్కడంతా బ్లూ మ్యాటె..!

3) రాజు అలాగే భీమ్ ల మొదటి మీటింగ్ సన్నివేశం కూడా బ్లూ మ్యాట్ లో చూపించినదే..! వీళ్ళిద్దరూ ఎంతో దూరంలో ఉండరు. కానీ సినిమాలో చాలా దూరంగా ఉన్నట్టు చూపిస్తారు.

4) రామరాజు, భీమ్ లు పిల్లాడిని కాపాడ్డానికి బ్రిడ్జి పై కలుసుకోవడం.. ఆ రూఫ్ లు కట్టుకునే సన్నివేశం కూడా బ్లూ మ్యాట్ లో చిత్రీకరించినదే.

5) రామ్, భీమ్ లు బ్రిడ్జి క్రాస్ చేస్తున్నప్పుడు ఫైర్ ఉన్నట్టు చూపిస్తారు. కానీ అక్కడి అది ఉండదు.

6) పిల్లాడిని కాపాడేప్పుడు చరణ్ వేలాడుతున్న క్రింది భాగం చూస్తే అదంతా బ్లూ మ్యాట్ ఉంటుంది. కానీ సినిమాలో వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఎన్టీఆర్ పిల్లాడిని లిఫ్ట్ చేస్తూ వస్తున్నప్పుడు వెనుక ఫైర్ ఉన్నట్టు చూపిస్తారు. నిజానికి అలాంటిది ఉండదు.

7) రామ్, భీమ్ లు బ్రిడ్జి క్రింద చేతులు పట్టుకుని రూఫ్ లు కట్టుకుని వేలాడుతూ పేర్లు చెప్పుకుంటారు. ఆ సన్నివేశం కూడా బ్లూ మ్యాట్ లో తీసినదే. కానీ మనకి క్రింద వాటర్ ఉన్నట్టు చూపిస్తారు. మరో పక్క ఫైర్ ఉన్నట్టు చూపిస్తారు.

8) దోస్తీ సాంగ్లో మనకి టాప్ యాంగిల్ లో చూపిస్తున్నప్పుడు బోలెడంత మంది జనాలు, పక్కన ఇల్లులు, టెంపుల్ వాతావరణం కనిపిస్తుంది. కానీ ఇక్కడ నిజానికి కొంతమంది మాత్రమే ఆ సాంగ్ లో ఉంటారు. అది కూడా బ్లూ మ్యాట్ లో చిత్రీకరించిన పాటే..!

ఏది ఏమైనా… జక్కన్న ఆలోచనా శైలిని అర్ధం చేసుకుని వి.ఎఫ్.ఎక్స్ ను డిజైన్ చేయడం అంటే మాటలు కాదు. అలాగే అంత క్వాలిటీ ఔట్పుట్ ను రాబట్టుకోవడం కూడా ఆషామాషీ వ్యవహారం కాదు. డైరెక్టర్ విజన్ అంటూ లేకపోతే టెక్నికల్ టీం ఏమని కష్టపడతారు ఎంతని కష్టపడతారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus