సాయిధరమ్ తేజ్ సరసన నాని హీరోయిన్!
- February 19, 2018 / 07:00 AM ISTByFilmy Focus
అమ్మడు నటించిన మొదటి చిత్రమైన “ఆకతాయి” కనీసం రిలీజైనట్లు కూడా సగం మంది ఇండస్ట్రీ వర్గాలకే తెలియదు. అలాంటిది రెండో చిత్రానికే నాని సరసన కథానాయికగా నటించే అవకాశాన్ని సొంతం చేసుకోవడమే కాక మూడో చిత్రంతో మెగా కాంపౌండ్ లోకి అడుగిడేందుకు సన్నద్ధమవుతూ తన తోటి కథానాయికలకు గట్టి పోటీనిస్తుంది ముంబై బ్యూటీ రుక్సర్ మీర్. ప్రస్తుతం నాని సరసన “కృష్ణార్జున యుద్ధం”లో కథానాయికగా నటిస్తున్న ఈ అమ్మడు సాయిధరమ్ తేజ్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కబోయే తాజా చిత్రంలో కథానాయికగా నటించే సదవకాశం సొంతం చేసుకొందని తెలుస్తోంది.
వరుసబెట్టి అయిదు పరాజయాలు రావడంతో సాయిధరమ్ తేజ్ మాస్ మసాలా చిత్రాలను వీడి కొత్త కాన్సెప్ట్ లేదా డిఫరెంట్ ఫిలిమ్స్ వైపు తన చూపు తిప్పుకొన్నాడు. అందుకే ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ఒక ప్యూర్ లవ్ స్టోరీలో నటిస్తున్న తేజు, ఆ సినిమా తర్వాత సినిమాగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక అడ్వంచరస్ ఫిలిమ్ చేయనున్నాడు. డిఫరెంట్ మూవీస్ కి పెట్టింది పేరైన చంద్రశేఖర్ ఏలేటి సాయిధరమ్ తేజ్ ఇమేజ్ కి తగ్గట్లు మంచి కథ సిద్ధం చేశాడట. కరుణాకరణ్ సినిమా విడుదలైన తర్వాత చంద్రశేఖర్ ఏలేటి సినిమా సెట్స్ కు వెళుతుంది.












