సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా కోలుకొని.. గతేడాది ‘విరూపాక్ష’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ మూవీలో సాయి ధరమ్ తేజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అటు తర్వాత తన మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో’ చేశాడు. అది పెద్దగా ఆడలేదు కానీ.. సాయి ధరమ్ తేజ్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది అని చెప్పవచ్చు.
ఇక ఆ సినిమా తర్వాత ‘గంజా శంకర్’ (Ganja Shankar) అనౌన్స్ చేశాడు. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకుడు కాగా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నాగవంశీ ఈ ప్రాజెక్టుని నిర్మించాల్సి ఉంది. ఆల్రెడీ చిన్న గ్లింప్స్ లాంటిది బయటకు వచ్చింది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతుంది. సాయి ధరమ్ తేజ్ రూ.15 కోట్లు పారితోషికం డిమాండ్ చేయడంతో సినిమా ఆగిపోయింది అంటూ ఆ ప్రచారం ఇంకా ఊపందుకుంటుంది అని చెప్పాలి. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదు.
పారితోషికం ఓకే అనుకున్న తర్వాత తేజు ప్రాజెక్ట్ కి సైన్ చేసిన తర్వాతే అనౌన్స్మెంట్ ఇచ్చాము అని చిత్రబృందం చెబుతోంది. ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదట. కానీ హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం తప్పుకుంది అని స్పష్టమవుతుంది. డీ గ్లామరస్ రోల్ కావడంతో పూజా హెగ్డే ఈ సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని సమాచారం. ఆమె పాత్ర ప్రకారం జైల్లో వైట్ హెయిర్ తో కనిపించాల్సి ఉందట. అంత డీ గ్లామరస్ గా చేయడానికి ఆమె రెడీగా లేదు అని స్పష్టమవుతుంది.