సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2 రాబోతుందా… నిజమెంత!

సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరెక్కిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు వెంకటేష్ నటన ఎంతో అద్భుతం అని చెప్పాలి. అన్నదమ్ములుగా మహేష్ బాబు వెంకటేష్ నటనతో అందరిని ఆకట్టుకున్నారు. ఇలా 2013 వ సంవత్సరంలో అందరి హృదయాలను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఈ సినిమా సీక్వెల్ చిత్రం రాబోతుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్ చిత్రం గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా సీక్వెల్ చిత్రం రాబోతుందని ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం పెద్దకాపు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 29వ తేదీ విడుదల కాబోతోంది.

ఇలాంటి తరుణంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu) సీక్రెట్ సినిమా గురించి వార్తలు వస్తున్నప్పటికీ పెద్దకాపు ప్రమోషన్లలో పాల్గొన్నటువంటి ఈయన ఎక్కడ స్పందించి క్లారిటీ ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే ఈ సినిమా మాత్రం తప్పకుండా వస్తుందంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఒకవేళ ఈ సినిమా సీక్వెల్ చిత్రం వచ్చినప్పటికీ ఈ సినిమాలో నటించిన నటీనటులే ఇందులో నటిస్తారా లేదా అన్న సందేహం కూడా తలెత్తుతుంది.

ముఖ్యంగా మహేష్ బాబు ఈ సీక్వెల్ సినిమాలో నటిస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో మహేష్ ఈ సీక్వెల్ సినిమాలో నటిస్తారా లేదా అన్నది తెలియదు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus