Bhagavanth Kesari: భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్ కావడం వాళ్లకు నచ్చలేదా?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం కొనసాగిస్తోంది. ఫస్ట్ వీక్ కలెక్షన్లతో మెజారిటీ ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది కావాలని భగవంత్ కేసరి కలెక్షన్లలో నిజం లేదంటూ విషప్రచారం చేస్తున్నారు. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్ కావడం వాళ్లకు నచ్చలేదని అందుకే ఈ సినిమాను టార్గెట్ చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

భగవంత్ కేసరి సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. బాలయ్య తన సినిమా హిట్టైనా ఫ్లాపైనా అంగీకరిస్తారు. ఫేక్ కలెక్షన్లను తన సినిమాకు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం బాలయ్యకు లేదనే సంగతి తెలిసిందే. బాలయ్య ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం గమనార్హం.

బాలయ్య బాబీ కాంబో మూవీకి సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. బాబీ గత సినిమాలను మించి ఈ సినిమా స్క్రిప్ట్ ను రాసుకున్నారని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాను (Bhagavanth Kesari) పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలయ్య వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించగా తర్వాత సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. వరుస ప్రాజెక్ట్ లతో బాలయ్య బిజీగా ఉండగా సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో బాలయ్య పారితోషికం ఉంది. వరుస విజయాలు బాలయ్య మార్కెట్ ను పెంచుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus