NTR, Dulquer: ఎన్టీఆర్, దుల్కర్ కాంబినేషన్ లో మూవీ.. కానీ?

  • November 21, 2023 / 03:44 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో మూడేళ్ల పాటు వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ లేదు. అయితే ఎన్టీఆర్, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో పవన్ సాధినేని డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. బాలయ్య బాబీ కాంబో మూవీకి సంబంధించి ఇప్పటికే దుల్కర్ పేరు వినిపించింది.

బాబాయ్, అబ్బాయ్ లలో ఎవరి సినిమాకు దుల్కర్ ఓటేస్తారో చూడాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించి మేకర్స్ నుంచి క్లారిటీ వస్తే మాత్రమే దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలలో నటిస్తారో లేదో తెలుస్తుందని చెప్పవచ్చు. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్ మరిన్ని తెలుగు ప్రాజెక్ట్ లలో నటించి అభిమానులను ఆకట్టుకుంటారేమో చూడాల్సి ఉంది. దుల్కర్ సల్మాన్ రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉంది.

(Jr NTR) ఎన్టీఆర్, దుల్కర్ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ఒకటి వైరల్ కావడంతో ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ దేవర డిసెంబర్ నెలాఖరు సమయానికి పూర్తి కానుందని తెలుస్తోంది. యాక్షన్ సీన్లను మొదట తెరకెక్కించిన కొరటాల శివ ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు లీక్ కాకుండా కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొరటాల శివ ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారని సమాచారం అందుతోంది.

ఆచార్య సినిమా బిజినెస్ వ్యవహారాలలో జోక్యం చేసుకున్న కొరటాల శివ దేవర సినిమా బిజినెస్ వ్యవహారాలకు మాత్రం దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది. దేవర సినిమా ప్రమోషన్స్ సైతం త్వరలో మొదలుకానున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus