Prabhas: రాధేశ్యామ్ గురించి షాకింగ్ న్యూస్ వైరల్!

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. మార్చి 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించినా ఆ తేదీకి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో రాధేశ్యామ్ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ పై దృష్టి పెట్టారని సమాచారం.

మే నెలలో రాధేశ్యామ్ రిలీజయ్యే ఛాన్స్ ఉందని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వార్త ప్రభాస్, పూజా హెగ్డే అభిమానులను టెన్షన్ పెడుతోంది. రాధేశ్యామ్ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉందని ఆ సాంగ్ ను ప్రభాస్, పూజా హెగ్డే డూప్ లతో చిత్రీకరించారని వైరల్ అవుతున్న వార్త సారాంశం. ఒక ఫుల్ సాంగ్ ను డూప్ లతో తెరకెక్కించడం ఇదే తొలిసారి అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాలో ఒక పాటను హీరోహీరోయిన్ లేకుండా తెరకెక్కించారంటే సాహసమే అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. పూజా హెగ్డే బిజీగా ఉండటం, ప్రభాస్ రొమాంటిక్ సీన్లలో, సాంగ్స్ లో నటించాలంటే సిగ్గు పడతాడు కాబట్టి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రాధేశ్యామ్ మేకర్స్ చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో చూడాల్సి ఉంది.

సాంగ్ లో క్లోజప్ షాట్స్ లో మాత్రం ప్రభాస్, పూజా హెగ్డే కనిపిస్తారని బోగట్టా. పునర్జన్మల కథాంశంతో తెరకెక్కిన రాధేశ్యామ్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం రాధేశ్యామ్ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus