Veera Simha Reddy: ‘అఖండ’తో ‘వీరసింహారెడ్డి’ పోలిక!

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి బాలయ్య నటించిన ‘అఖండ’కి మధ్య ఒక పోలిక ఉంది. అదేంటంటే.. సినిమా రన్ టైం. సాధారణంగా కమర్షియల్ సినిమాల రన్ టైం రెండున్నర గంటల లోపు ఉండేలా దర్శకనిర్మాతలు జాగ్రత్త పడతారు. అంతకంటే ఎక్కువ నిడివి ఉంటే ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉందని మేకర్స్ తక్కువ నిడివి ఉండేలా చూసుకుంటారు.

అయితే రెండున్నర గంటల కంటే ఎక్కువ రన్ టైం ఉన్న సినిమాలు భారీ విజయాలు సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో ‘అఖండ’ సినిమా ఒకటి. దాని రన్ టైం రెండు గంటల నలభై నిమిషాలు. ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’ రన్ టైం కూడా అటు ఇటుగా అంతే ఉంటుందని సమాచారం. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ‘వీరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ఒక్క సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.

త్వరలోనే బాలకృష్ణ, శృతిహాసన్ మీద ఆ పాటను చిత్రీకరిన్చానున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మరోపక్క ప్రమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి ‘జై బాలయ్య’ అనే పాటను రిలీజ్ చేశారు. గురువారం నాడు సినిమా నుంచి మరో పాటను రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా బీజియం పనులు మొదలుపెట్టినట్లు తమన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రితో దిగిన ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు వంటి నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus