రామ్ గోపాల్ వర్మ వద్ద సహాయ దర్శకుడిగా అనేక సినిమాలకు పనిచేసిన దర్శకుడు అజయ్ భూపతి తొలిసారి దర్శకుడిగా మారి తీసిన మూవీ ఆర్ఎక్స్ 100 . చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బడ్జెట్ ని రెండురోజుల్లో రాబట్టి 20 కోట్ల గ్రాస్ ని వసూలుచేసింది. దీంతో డైరక్టర్, హీరో హీరోయిన్లకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ చిత్రానికి 5 లక్షలు మాత్రమే తీసుకున్న పాయల్ రాజ్ పుత్ అరకోటికి డిమాండ్ చేస్తోంది. ఇక హీరోగా నటించిన కార్తికేయ కోటి రూపాయలు అడుగుతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
కార్తికేయ డేట్స్ కోసం వెళ్లే నిర్మాతలకు అతని చెబుతున్న రేట్ చూసి షాక్ అవుతున్నారంటా. రెండు, మూడు కోట్లతో సినిమా తీయాలని ఆశపడే నిర్మాతలు అయితే వన్ ఫిలిం వండర్ కార్తికేయకు అంత అవసరమా? అని విమర్శిస్తున్నారు. ఒక సినిమా హిట్ కొట్టినంతమాత్రానా ప్రతి సినిమా ఆరేంజ్ లో ఆడుతుందని గ్యారంటీ లేదని చెబుతున్నారు. ఎంతమంది నో చెబుతున్నా కార్తికేయ మాత్రం తన పారితోషికం తగ్గించుకోవడం లేదని తెలిసింది. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే ఉద్ధేశంతోటే .. ద్విభాషా చిత్రం చేసుకొని మంచి రెమ్యునరేషన్ అందుకోవాలని కార్తికేయ చూస్తున్నారు. మరి కార్తికేయ తన స్టాండ్ మీద ఎంతకాలం నిలబడతారో చూడాలి.