కరోనా వచ్చేసింది అంటున్న ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్!
- August 13, 2020 / 11:48 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరిగిపోతుంది. బుల్లితెర తారలతో మొదలైన ఈ కరోనా విజృంభణ మెల్లగా పరిశ్రమ మొత్తం పాకుతుంది. ఇప్పటికే అనేకమంది టాలీవుడ్ సెలెబ్రిటీలు కరోనా బారినపడ్డారు. దర్శకుడు రాజమౌళి కుటుంబం మొత్తానికి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. రెండు వారాల హోమ్ కొరెంటైన్ పాటించిన రాజమౌళి కుటుంబం, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. కాగా నిన్న పూర్తిగా కరోనా నయమైనట్లు రాజమౌళి ట్వీట్ చేయడంతో పాటు, కొద్దిరోజులలో ప్లాస్మా దానం చేస్తాం అని చెప్పడం జరిగింది.
కాగా ఓ యంగ్ డైరెక్టర్ తాజాగా కరోనా సోకినట్లు ధృవీకరించారు. ఆర్ ఎక్స్ 100 మూవీతో భారీగా ఫేమ్ తెచ్చుకున్న అజయ్ భూపతికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన పరోక్షంగా తెలియజేశారు. ఆయన తన ట్వీట్ లో ‘వచ్చేసింది’ అని మెన్షన్ చేశారు. దానితో అజయ్ భూపతికి కరోనా సోకిందన్న విషయంపై క్లారిటీ వచ్చింది. అజయ్ భూపతి హోమ్ కోరంటైన్ కావడంతో పాటు, చికిత్స తీసుకుంటున్నారని సమాచారం.

అజయ్ భూపతి ప్రస్తుతం మహా సముద్రం అనే మూవీ ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రంలో రవితేజ నటించాల్సివుండగా ఆయన తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ చిత్రంలో హీరోగా శర్వానంద్ నటిస్తున్నట్లు సమాచారం అందుతుంది.
Vachesindi
— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 12, 2020
త్వరలో వస్తా..
ప్లాస్మా ఇస్తా…— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 12, 2020
Most Recommended Video
గుంజన్ సక్సెనా: ది కార్గిల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
రిలీజ్ తర్వాత చాలా లేట్ గా టీవీల్లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్..!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?













