ఆర్ ఎక్స్ 100 సినిమాపై పెరుగుతున్న అంచనాలు!

కొన్ని సినిమాలకు షూటింగ్ మొదలైనప్పట్నుంచి విపరీతమైన హడావుడి చేసి, ట్రైలర్ లాంచ్ మొదలుకొని ప్రతి పాట రిలీజ్ కి ఫేస్ బుక్, ట్విట్టర్ లో పెయిడ్ క్యాంపైన్స్ నిర్వహించి హల్ చల్ చేసినా పెద్దగా బజ్ క్రియేట్ అవ్వదు. ఒకవేళ క్రియేట్ అయినా అది సినిమాకి ఏమాత్రం ఉపయోగపడదు. కానీ.. కొన్ని సినిమాలకి మాత్రం పోస్టర్స్, ట్రైలర్స్ తోనే విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. అలా ప్రస్తుతం కేవలం ట్రైలర్ తో హల్ చల్ క్రియేట్ చేసిన చిత్రం “ఆర్ ఎక్స్ 100”. పోస్టర్స్ విడుదలైనప్పుడు ఇదేదో ఒక నార్మల్ లవ్ స్టోరీ అని లైట్ తీసుకొన్నారు అందరూ. కానీ.. ట్రైలర్ రిలీజయ్యాక సినిమాకి విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది.

రాంగోపాల్ వర్మ అసిస్టెంట్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తికేయ-పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తుండగా.. రావురమేష్, రాంకీ కీలకపాత్రలు పోషిస్తుండడం విశేషం. సినిమా ట్రైలర్ మాత్రం చాలా నేచురల్ గా, రస్టిక్ గా ఉంది. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటే సూపర్ హిట్ అవ్వడం అనేది పెద్ద కష్టమైన పనేమీ కాదు. కాకపోతే.. సినిమా కంటెంట్ అండ్ జోనర్ కాస్త హిందీ సినిమా “ఇషాక్ జాదే”ను గుర్తుకుతెస్తుండడం ఒక్కటే గమనార్హమైన విషయం. మరి “ఆర్ ఎక్స్ 100” మరో “అర్జున్ రెడ్డి”లా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో తెలియాలంటే జూన్ 29 వరకూ వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus