స్పైడర్ కధ ఇదే అని విలన్ చెప్పేసాడు!!

స్పైడర్…ఒకటి కాదు…రెండు కాదు…దాదాపుగా ఏడాది నుంచి ఊరిస్తున్న పేరు…అయితే ఈ సినిమా లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి…అవేమిటి అంటే…సూపర్ స్టార్ మహేష్ తొలిసారి తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించిన ద్విభాషా చిత్రం ఈ ‘స్పైడర్’. అంటే కాదు…ఈ సినిమాకి తమిళ సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డైన ఏఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తూ ఉండడం మరో విశేషం…ఇక  మరింత ఆసక్తికర….విషయం ఏంటి అంటే… మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే అత్య‌ధికంగా రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన తొలి సినిమా ఇది…మరో ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్న…అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఆలోచన మాత్రం అందరిలోనూ ఉండడం…దీనిపై రకరకాల రూమర్స్ బయటకు వస్తూ ఉన్న క్రమంలో…తాజాగా స్పైడ‌ర్ ఫ‌స్టాఫ్‌, సెకండాఫ్‌లు ఎలా ఉండ‌బోతున్నాయో లైన్  సైతం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

అయితే ఇదేదో ఫేక్ న్యూస్ లేదా…రూమర్ అనుకోకండి…ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్ ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన్న ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య ( ఈ సినిమాలో మెయిన్ విల‌న్‌) ఈ స్పైడ‌ర్ స్టోరీ లైన్ చెప్పాడు. అయితే ఇంతకీ అసలు అతను ఏం చెప్పాడు అంటే…. స్పైడ‌ర్‌ ఫస్టాఫ్ చాలా నవలాత్మకంగా ఉంటుంది. అలాగే సెకండాఫ్ ఎమోషనల్ గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ప్రత్యేకంగా మహిళా ప్రేక్షకుల కోసమే అన్నట్టు ఉంటాయ‌ని… ఓవ‌రాల్‌గా థ్రిల్లింగా సాగే యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ ఈ సినిమా అని సూర్య చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ స్పైడ‌ర్‌ను స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది. కమర్షియల్ అంశాలతో పాటు తానెప్పుడూ మిస్ కాకుండా చూసుకునే ఎమోషన్ ను కూడా ఇందులో బాగానే ఎలివేట్ చేశారని అనిపిస్తోంది.  మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా మంచి కమర్షియల్ ఎమోషనల్ డ్రామా అని అనిపిస్తుంది…చూద్దాం మరి ఈ సినిమా రిసల్ట్ ఎలా ఉండబోతుందో?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags