రెండు భారీ చిత్రాలకి.. భారీ రేట్లు లభించాయి?

టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటో అందరికి తెలిసిపోయింది. ఇంతకీ ఏ సినిమా టీజర్ అనుకుంటున్నారా..? అదేనండీ మన ప్రభాస్ ‘సాహో’ టీజర్. ఈ యాక్షన్ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. దీంతో ఈ చిత్రం బిజినెస్ కూడా మొదలైపోయింది. అంతేకాదు ఈ చిత్రం బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది. అయితే బిజినెస్ విషయంలో ‘సాహో’ చిత్రం కంటే జక్కన్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం రెండు మెట్లు పైనే ఉంది. రాంచరణ్ – ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ రెండు చిత్రాలు డిఫరెంట్ జోనర్లు అయినప్పటికీ ఈ రెండు చిత్రాల పై ప్రేక్షకులు ఎక్కువ దృష్టి పెట్టారు. అద్భుతమైన విజువల్స్ తో యాక్షన్ ట్రీట్ లా రూపొందుతున్న ఈ చిత్రాల పై విదేశీయుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలకి ఓవర్సీసీ రైట్స్ కూడా భారీగా పలుకాయట. ‘సాహో’ చిత్రానికి ఓవర్సీస్లో 43 కోట్ల బిజినెస్ జరిగిందట. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి 65కోట్ల బిజినెస్ జరిగిందట. ఒక్క చైనా లో మాత్రం ఈ రెండు చిత్రాలకి బిజినెస్ ఇంకా పూర్తవ్వలేదంట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus