‘సాహో’ చిత్రం ఆ రికార్డును బ్రేక్ చేసిన ప్రభాస్..!

‘బాహుబలి’ చిత్రంతో ఇండియన్ వైడ్ స్టార్ హీరోగా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం యాక్షన్ ఎలెమెంట్స్ హాలీవుడ్ రేంజ్లో ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. దీంతో ఈ చిత్రం పై అంచనాలు మరింత పెరిగాయి. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూ.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇంకా విడుదల కాకముందే ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఏకంగా రజినీకాంత్ రికార్డునే బ్రేక్ చేశాడట ప్రభాస్.

విషయంలోకి వెళితే… పారిస్ లోని ప్రతిష్ఠాత్మక థియేటర్ ‘లి గ్రాండ్ రెక్స్’లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారట. వంద ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్న ఈ థియేటర్ యూరప్ లోనే అతి పెద్దది. ఈ థియేటర్ లో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమాను వీక్షించవచ్చు. ఇప్పటి వరకు రజనీకాంత్ నటించిన ‘కబాలి’, విజయ్ నటించిన ‘మెర్సెల్’, ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ దక్షిణాది చిత్రాలు మాత్రమే ఈ థియేటర్ లో ప్రదర్శించబడ్డాయట. ఇప్పుడు ‘సాహో’ను కూడా ఆ థియేటర్ లో ప్రదర్శించబోతుండడంతో … ఆ థియేటర్ లో రెండు సినిమాలను విడుదల చేసిన తొలి హీరోగా ప్రభాస్ రికార్టు సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus