ఓపెనింగ్స్ బాగున్నాయి డార్లింగ్.. కానీ?

  • September 3, 2019 / 06:21 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘సాహో’. తాజాగా(ఆగష్టు 30న) విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ క్రిటిక్స్, అలాగే టాలీవుడ్ క్రిటిక్స్ నెగెటివ్ రివ్యూలు, రేటింగ్ లతో ఏకిపడేశారు. కానీ హై రేంజ్ యాక్షన్ వాల్యూస్ కు, ప్రభాస్ నటనకి మార్కులే పడ్డాయి. ‘ప్రభాస్ ఉండగా.. టాక్ తో సంబంధమేంటి’ అనేలా ప్రేక్షకులు ‘సాహో’ చిత్రం చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మొదటి 4 రోజులలో మంచి ఓపెనింగ్స్ నే సాధించింది ఈ చిత్రం.

ఇక ‘సాహో’ చిత్రం 4 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 23.30 కోట్లు
వైజాగ్ – 8.0 కోట్లు
సీడెడ్ – 9.60 కోట్లు


వెస్ట్ – 4.86 కోట్లు
ఈస్ట్ – 6.40 కోట్లు
కృష్ణా – 4.50 కోట్లు


గుంటూరు – 7.10 కోట్లు
నెల్లూరు – 3.59 కోట్లు
———————————————————–
ఏపీ + తెలంగాణ – 67.35 కోట్లు


కర్ణాటక – 12.70 కోట్లు
కేరళ – 1.10 కోట్లు
తమిళనాడు – 4.50 కోట్లు


నార్త్ ఇండియా – 53.55 కోట్లు
ఓవర్సీస్ – 25.10 కోట్లు
————————————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 164.30 కోట్లు (షేర్)
————————————————————–

‘సాహో’ చిత్రానికి 290 కోట్ల వరకూ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం మొదటి నాలుగు రోజుల్లో 164.30 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే 50 శాతం పైనే రికవరీ అయినట్టే..! ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 130 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ ఎలాగూ సెలవలు ఉన్నాయి కాబట్టి బాగానే క్యాష్ చేసుకుంది. కానీ ఈ చిత్రానికి అసలు పరీక్ష ఈ మంగళవారం నుండీ మొదలు కానుంది. కానీ ఎంత డిజాస్టర్ రివ్యూలు వచ్చినా ఈ చిత్రం మంచి వసూళ్ళే సాధించింది. మంగళవారం రోజు చిత్రం కలెక్షన్లు బట్టి ఫైనల్ గా ఎంత వసూళ్ళు రావొచ్చనేది ఒక అంచనా వేయొచ్చు. ఇది పక్కన పెడితే ‘సాహో’ చిత్రం సరిగ్గా ఉపయోగించుకుంటే… మరో 10 రోజుల వరకూ మంచి కలెక్షన్లు రాబట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ వారం ఎలాగూ పోటీ సినిమాలు లేవు. ఇక నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం సెప్టెంబర్ 13 న విడుదల కాబోతుంది. మరి ఈ అవకాశాన్ని ‘సాహో’ ఎంతవరకూ ఉపయోగించుకుంటాడో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus