“మన తెలుగు హీరో నటించగా, తెలుగు యువ దర్శకుడు తెరకెక్కించిన తెలుగు సినిమాకు మన తెలుగోళ్ళే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయగా.. నార్త్ జనాలు మాత్రం మన సినిమాను అక్కున చేర్చుకొన్నారు”.. గత రెండు రోజులుగా “సాహో” నార్త్ లో భీభత్సంగా ఆడుతుండడాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ మరియు కొందరు ఇంటలెక్చువల్స్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్న మెసేజ్ ఇది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కలిపి సాహో 300 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేయడం నిజంగా ఆశ్చర్యకరం, గర్వకారణం కూడా. కానీ.. అంతమాత్రాన తెలుగు ప్రేక్షకులు, రివ్యూ రైటర్లకు టేస్ట్ లేదని హడావుడి చేయడం అనేది హాస్యాస్పదం అవుతుంది. సాహో సినిమాలో చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి అనేది ఎంత నిజమే.. ప్రారంభ వసూళ్లకు కారణం ప్రీబుకింగ్స్ మరియు మూడు రోజుల సెలవు (శనివారం, ఆదివారం, సోమవారం) కారణం అనే విషయం కూడా అంతే నిజం.
సోమవారం నుంచే నార్త్ ఏరియాలో కలెక్షన్స్ జోరు తగ్గింది. ఇక సౌత్ లో స్టడీగా ఉన్న సాహో కలెక్షన్స్ ఇవాల్టి నుండి స్లో అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈవారం చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు కాబట్టి తెలుగు, హిందీ భాషల్లో సాహోకి అడ్డు లేకపోవచ్చు కానీ.. “బాహుబలి” తరహాలో రిపీట్ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించే కంటెంట్ సాహోలో లోపించింది అనడంలో మాత్రం సందేహం లేదు.
ఒక యావరేజ్ కథ, బోలెడన్ని లూప్ హోల్స్ ఉన్న కథనం, పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేని గ్రాఫిక్స్, బిలో యావరేజ్ మ్యూజికల్ ఆల్బమ్ ఉంటేనే “సాహో” ఇలా కలెక్షన్ల సునామీ సృష్టిస్తే.. పైన పేర్కొన్నవన్నీ పర్ఫెక్ట్ గా ఉండి ఉంటే.. ఆ సునామీ రేంజ్ ఏమిటి అనేది ఊహించడానికి కూడా ట్రేడ్ విశ్లేషకులు భయపడుతున్నారు. అందుకే.. సినిమా బాగోలేదు అని విశ్లేషణలు వెల్లడిస్తున్న వారిని తిట్టడం మానుకొని.. కంటెంట్ మీద దృష్టిసారితే మంచి సినిమాలోస్తాయి. అయినా.. మనోళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఒక చెత్త సినిమాకి మంచి రివ్యూలు వచ్చిన రోజులు ఉన్నాయి కానీ.. ఒక మంచి సినిమాకి చెత్త రివ్యూ కాదు కనీసం నెగిటివ్ రివ్యూ వచ్చిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.