‘సాహో’ మొదటి రోజు టార్గెట్ ఎంతంటే..?

కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఇండియా వైడ్ ప్రేక్షకులు మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం ‘సాహో’. ‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్ నుండీ వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. ఆగష్టు 30 న విడుదల కాబోతున్న ఈ చిత్రం మొదటి రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అనేదాని పై అందర్లోనూ ఆసక్తి పెరిగింది. ‘యూ.వి.క్రియేషన్స్’ సంస్థ పై వంశీ ప్రమోద్ లు ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. పెద్ద మొత్తంలో బిజినెస్ జరిగినా… 500 కోట్ల వరకూ ఈ చిత్రం వసూళ్ళను రాబట్టాల్సి ఉంది.

దీంతో మొదటి రోజు 130 కోట్ల వరకూ వసూళ్ళు రాబట్టాల్సి ఉంది. ‘అయితే ‘సాహో’ కి అంత సినిమా ఉందా…?’ అనే అనుమానం అందరిలోనూ ఉంది. ‘బాహుబలి’ ‘బాహుబలి2’ క్రేజ్ ఉంది కదా… అంటే అది వేరే సంగతి. ‘బాహుబలి’ మేజర్ క్రెడిట్ రాజమౌళికి వెళుతుంది. సినిమా తీసిన దగ్గర్నుండీ ఆ చిత్రాన్ని ప్రమోట్ చేసిన రేంజే వేరు. కానీ ‘సాహో’ సంగతి వేరు. దర్శకుడికి ఇది కేవలం రెండో సినిమా మాత్రమే. ఒకవేళ సినిమాకి ‘యునానిమస్’ గా పాజిటివ్ టాక్ వచ్చిందంటే… రికార్డు వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంటుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus