ప్రభాస్ సాహో మూవీ రిలీజ్ డేట్ పై అప్డేట్!

బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో గురించి రోజుకో ఆసక్తికర విషయం బయటికి వస్తోంది. డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 200 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్న ఈ మూవీకి బాలీవుడ్, హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషయన్లు పనిచేస్తున్నారు. ప్రభాస్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అబుదాబిలో తెరకెక్కిస్తున్నారు.  ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్ లు పాల్గొంటున్న ఈ యాక్షన్ సీన్స్ ను మిషన్ ఇంపాజిబుల్ వంటి అనేక హిట్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో షూట్ చేస్తున్నారు.

జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు  సంగీతాన్ని  అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికీ షూటింగ్ కూడా పూర్తి అయ్యేట్టులేదని సమాచారం. ఇంకా విజువల్ ఎఫక్ట్స్ వర్క్ పూర్తి అయ్యేసరికి చాల సమయం పడుతుందని తెలిసింది. అందుకే వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus