అనారోగ్యంతో సాహో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన శ్రద్ధా కపూర్

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఇప్పుడు తెలుగువారందరికీ తెలుసు. ఎందుకంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గా ఎంపికైన క్షణంలోనే ఆమె తెలుగువారి అభిమాన హీరోయిన్ అయింది. యువ డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సాహో షూటింగ్ వేగంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రద్ధ కేవలం రొమాంటిక్ సన్నివేశాల్లోనే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో గాల్లో విన్యాసాలు చేయనుంది. ఇంతలా కష్టపడుతున్న శ్రద్ధ సాహో షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. కారణం డెంగ్యూ. కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం బాగాలేకపోతే వైద్య పరీక్షలు చేస్తే డెంగ్యూ అని తేలింది. అందుకే వైద్యులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు.

సెప్టెంబర్ 27 నుంచి షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చింది. శ్రద్ధా మరికొద్ది రోజులపాటు చిత్రీకరణకు హాజరు కాలేకపోవచ్చు. సాహోతో పాటు సైనా బయోపిక్ చిత్ర షూటింగ్ కి కూడా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అమోల్ గుప్తే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇందులో సైనాగా శ్రద్ధా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి షూటింగ్ వాయిదా వేసినట్లు ఆ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. పూర్తిగా కోలుకున్న తర్వాత శ్రద్ధా కెమెరా ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus