సమయాన్ని వృథా చేయకుండా సాగుతున్న సాహో చిత్ర బృందం!

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. అంచనాలకు మించి  ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు యువ దర్శకుడు సుజీత్. రామోజీ ఫిలిం సిటీ లో ఒక స్టయిల్లో యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేసిన డైరెక్టర్..  రీసెంట్ గా దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా టవర్ వద్ద ఓ ఫైట్ ప్లాన్ చేశారు. అయితే అక్కడ యాక్షన్ సీన్ చేయడానికి అనుమతులు లభించలేదు. ఆఖరి నిముషంలో షూటింగ్ క్యాన్సిల్ అయింది. అయినా సాహో టీమ్ నిరుత్సాహపడలేదు. ఆ డేట్స్ ని వృథా చేయకుండా వినియోగించుకోవడానికి సిద్ధమైంది. హైదరాబాద్ లోనే ఒక సన్నివేశాన్ని కంప్లీట్ చేయడానికి రెడీ అయింది.

ఇక్కడ షూట్ పూర్తి అయిన తర్వాత  దుబాయ్ శివార్లలోని భారీ ఎడారి, కొండల మధ్య ఛేజింగ్ సన్నివేశాలు తీయబోతున్నారు. సాహో సినిమాలో ఈ యాక్షన్ పార్ట్ ఏకంగా 20 నిమిషాల పాటు ఉండబోతోంది. ఈ 20 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా నెల రోజుల షెడ్యూల్ ఫిక్స్ చేశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 200  కోట్లతో ఈ చిత్రాన్ని వంశీ ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో  విలన్స్ గా బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే , తమిళనటుడు అరుణ్ విజయ్, మల్లూవుడ్ సీనియర్ నటుడు”లాల్”  తదితరులు నటిస్తున్నారు. జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు  సంగీతాన్ని  అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus